ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 22: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, యువతరానికి ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా హోదా అత్యవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత జగన్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాటం సాగిస్తామని, దీనికి యువతరం కలసిరావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో గురువారం వైసిపి ఆధ్వర్యంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం అప్పుడు సొంత మామకే వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికే వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు పూటకోమాట మాట్లాడి ప్రజలను మోసగిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు, మధ్యలో, ఆ తరువాత చంద్రబాబు వివిధ సందర్భాల్లో ప్రత్యేక హోదా విషయంలో చేసిన వ్యాఖ్యలతో కూడిన ఒక ఛానల్ క్లిప్పింగ్‌ను ఈసందర్భంగా ప్రదర్శించి, యువతరం అర్ధం చేసుకోవాలని జగన్ కోరారు. దీనిలోనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, అప్పటి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీలు కలిసి ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామని ఇచ్చిన హామీలు, ఆ తరువాత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దానికి భిన్నంగా మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను కూడా ప్రత్యేకంగా ప్రదర్శింపచేశారు. యువభేరికి హాజరైన యువతరం నుంచి దీనికి మంచి స్పందన లభించింది. యుపిఏ హయాంలో విభజన తప్పదని తెలిసిన సమయంలో హోదా ఇచ్చి ఆదుకుంటామన్న హామీతోనే బిజెపి అంగీకరించిందని, అప్పట్లో అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని విమర్శించారు. హామీపై ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని, అధికారంలోకి వచ్చాక హోదా వల్ల ఏం జరగదంటూ ప్రచారం మొదలెట్టారని ధ్వజమెత్తారు. చివరకు వాళ్లు ఇవ్వరు, చంద్రబాబు అడగలేరు అన్నట్లుగా మారిపోయిందని విమర్శించారు.

చిత్రం.. ఏలూరులో గురువారం యువభేరి కార్యక్రమంలో ప్రసంగిస్తున్న జగన్