ఆంధ్రప్రదేశ్‌

మృత్యుంజయుడు వెంకటేశ్వర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 22: ఒకవైపు జోరువాన.. మరోవైపు ముంచెత్తిన వరదనీరు.. కుటుంబసభ్యులతో పాటు వరదనీటిలో కొట్టుకుపోతున్న అతనికి తాటిచెట్టే జీవనాధారమైంది. అదే అదనుగా చెట్టుపైకి ఎక్కి దాదాపు 8 గంటలకు పైగా ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి మృత్యుంజయుడుగా నిలిచాడు.. చిలకలూరిపేట సమీపంలోని గంగన్నపాలెం ఎత్తిపోతల పథకం వద్ద వెంకటేశ్వర్లు, తల్లిదండ్రులు చేవూరి కొండలు, సుబ్బులు, తన చిన్నాన్న కుమార్తె వనజ జీవిస్తున్నారు. గురువారం వరదనీరు ప్రవహిస్తున్నా పెద్దగా ప్రమాదం ఉండదని భావించారు. అయితే వాగు నీటి ప్రవాహం ఉద్ధృతం కావడంతో కుటుంబం యావత్తు నీటిలో కొట్టుకుపోయారు. కొద్దిదూరం వెళ్లిన వెంకటేశ్వర్లు తాటిచెట్టును పట్టుకుని పైకిఎక్కి సాయం కోసం హాహాకారాలు చేశాడు. సాయంత్రం సమయానికి స్థానికులు తాళ్ల సాయంతో అతన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
బతుకుతాననుకోలేదు
తాటిచెట్టు ఎక్కుతుంటే వర్షానికి చేతులు జారి కిందపడిపోతాననే భయం ఒకవైపు.. మరోవైపు గల్లంతయిన తల్లిదండ్రుల గురించి ఆందోళన.. కింద చూస్తే వరద నీటి ప్రవాహం.. ప్రాణాలతో బతికి బయటపడతాననుకోలేదని వెంకటేశ్వర్లు గద్గద స్వరంతో తన అనుభవాన్ని వివరించాడు. తాటిచెట్టును అంటిపెట్టుకుని చేజారుతుంటే ఎలా ఉంటుందనేది మాటలలో చెప్పలేకపోతున్నానని భయంతో వణికిపోయాడు. తాటిచెట్టుపై గండుచీమలు తన రక్తాన్ని పీల్చుతున్నా పట్టువదిలితే మృత్యువు ఖాయమని ఊపిరి బిగపట్టి గంటల కొద్దీ గడిపానని వివరించాడు.