ఆంధ్రప్రదేశ్‌

ఇసుక రవాణాపై నిరంతరం నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 7: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు నిరంతరం నిఘా పెట్టామని, బాధ్యులు ఎంతటివారినైనా ఉపేక్షించబోమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వినీత్ బ్రిజ్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ అమలులోకి వచ్చినప్పటి నుండి ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు డీజీపీ నేతృత్వంలో నిరంతరం నిఘా కొనసాగుతోందని పేర్కొన్నారు.
శనివారం గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎక్సైజ్ అండ్ ప్రొహబిషన్, మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులతో వినీత్ బ్రిజ్‌లాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది అక్రమ మద్యాన్ని నిరోధించే దిశగా పని చేయడంతోపాటు ఇసుక అక్రమ రవాణా కట్టడికి కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వీరికి పోలీసు, మైనింగ్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారుల సహకారం ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోను అక్రమ రవాణా జరగకూడదని స్పష్టం చేశారు. ఆయా శాఖల అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడులకు లొంగకూడదని స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిని గుర్తించి, సమాచారం అందించేందుకు శాండ్ విజిలెన్స్ ఒక యాప్‌ను రూపొందించిందని, అధికారులంతా దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యాన్ని పూర్తిగా నియంత్రించేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం మన రాష్ట్రంలోకి రాకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో శాంతి భద్రతల డీఐజీ ఎస్‌వి రాజశేఖర్‌బాబు, అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.