ఆంధ్రప్రదేశ్‌

అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: భారీ వర్షాల వల్ల ఏర్పడే ఎటువంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లు సన్నద్ధమై వుండాల్సిందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వలన వీలైనంతవరకూ ఆస్తి, ప్రాణ నష్టాలు తగ్గించేవిధంగా తక్షణ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. స్థానిక పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వర్షాలు, వరదలపై వీడియో మరియు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో వెంటనే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుని ఆస్తి, ప్రాణ నష్టాలు లేకుండా చూడాలన్నారు. వరద సహాయక చర్యలు అలాగే వరదల్లో చిక్కున్నవారిని కాపాడేందుకు గుంటూరు జిల్లాలో రెండు హెలికాప్టర్లను అందుబాటులో వుంచడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఆయా ప్రాంతాలకు పంపించి సహాయక చర్యలు చేపట్టామని సిఎం తెలిపారు. అవసరమైతే ఆర్మీ, నేవీ సహాయాన్ని కూడా తీసుకునేందుకు కూడా తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఇదే సమయంలో రైల్వే అధికారులను కూడా అప్రమత్తం చేసామన్నారు. కురుస్తున్న వర్షాలను బట్టి ఏయే ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది, ఏ ప్రాంతాలకు అధికంగా వరద ప్రభావం ఉంటుందనేది ముందుగానే అంచనాలు వేసి సంబంధిత జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేయాలని ప్రణాళికా శాఖ ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు. దీనివలన కలెక్టర్లు ఆయా ప్రాంతాల వారిని ముందుగానే అప్రమత్తం చేసి అవసరమయ్యే చర్యలు తీసుకోటానికి వీలుంటుందన్నారు.

చిత్రం.. నకరికల్లు మండలం జొన్నలగడ్డ సమీపంలో ధ్వంసమైన వంతెన