ఆంధ్రప్రదేశ్‌

మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 15 నగరపాలక సంస్థలకుగాను వార్డుల పునర్విభజనపై చెలరేగిన వివాదంతో కోర్టు ఆదేశాలకు లోబడి శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు కార్పొరేషన్‌లకు ఎన్నికలు నిర్వహించడం లేదు. అలాగే 104 మున్సిపాల్టీ, నగర పంచాయతీలకుగాను కేవలం 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతుంది. 14వ తేదీ నామినేషన్‌ల పరిశీలన, 16వ తేదీ మధ్యాహ్నం వరకు నామినేషన్‌ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు. 23వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఒక వేళ రీపోలింగ్ అవసరమైతే 26వ తేదీ
జరుగుతుంది. 27వ తేదీ ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ఆపై ఫలితాలు వెల్లడిస్తారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలన్నీ 23వ తేదీ ఒకే రోజు జరుగుతాయన్నారు. ఎన్నికల పరిశీలకులు తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ కమిషనర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్, ఎన్నికల కమిషన్ సంయుక్త కార్యదర్వి ఏవీ సత్యరమేష్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్