ఆంధ్రప్రదేశ్‌

ప్రలోభాలకు తావులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 9: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఈ విషయంలో ఎన్నికల పరిశీలకులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో 13 జిల్లాలకు నియమించిన పరిశీలకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల పరిశీలకులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరుపున జిల్లాల్లో విధులు నిర్వహించే బాధ్యత కల్పించిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అభద్రతా భావానికి లోనుకావద్దని కోరారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా
తనను సంప్రతించాలని నిరంతరం అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. పరిశీలకులు, ఉన్నతాధికారుల సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఎన్నికల కమిషన్ వాట్సాప్ గ్రూప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వలంటీర్ల సేవలు వినియోగించరాదని రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలకులుగా ఎలాంటి ఘటనలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వ పథకాలను ప్రకటించటంపై నిషేధం అమల్లో ఉందన్నారు. ప్రలోభాలకు గురిచేసే ఏ పథకమైనా నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు జిల్లా ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉండాలని వారి ఫోన్ నెంబర్, చిరునామా మీడియా ద్వారా తెలియ జేయాలన్నారు. ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా నిష్పక్షపాతంగా, నిర్భయంగా విధులు నిర్వర్తించాల్సి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నందున బ్యాలెట్ పత్రాల విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎన్నికల పరిశీలకులు నేరుగా జిల్లాలకు వెళ్లి వెంటనే విధులకు హాజరు కావాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి ఎస్ రామసుందర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఏవీ సత్యరమేష్, ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు.
*చిత్రం... స్థానిక ఎన్నికల పరిశీలకులతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్