ఆంధ్రప్రదేశ్‌

మరింత బలపడిన అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం గురువారం మరింత బలపడింది. వాయుగుండంగా మారే అవకాశం లేనప్పటికీ, అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షం కురుస్తుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉత్తర కోస్తాలో తూర్పు దిశగా, దక్షిణ కోస్తాలో పశ్చిమ దిశగా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గురువారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల్లో అత్యధిక వర్షపాతం సత్తెనపల్లిలో నమోదైంది. సత్తెనపల్లిలో 16 సెంటీమీటర్లు, అమలాపురం, మచిలీపట్నంలో 12, పాడేరు, కాకినాడలో 11, యలమంచిలి, ఆత్మకూరులో 9, చీపురుపల్లి, అవనిగడ్డ, తుని, రేపల్లె, గరివిడిలో 7, గుడివాడ, రామచంద్రపురంలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

చిత్రం.. దాచేపల్లిలో కాలువను తలపిస్తున్న వరద