ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం: వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా రాష్ట్రంలో పరిపాలనా విధ్వంసానికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలే దండయాత్ర చేసే రోజులు సమీపించాయని వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు వందల హామీలను ఇచ్చిన చంద్రబాబు కాపులను, రైతులను మోసం చేశారన్నారు. రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబుకు వ్యతిరేకంగా రైతులు చేసే ఉద్యమానికి మద్దతు ఇస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని, ఈ ఎన్నికల హామీ నెరవేర్చమని డ్వాక్రా సంఘాలు దండయాత్ర చేయాలన్నారు. బిసిలకు బడ్జెట్‌లో పదివేల కోట్లు కేటాయిస్తామన్నారని, వాల్మీకులకు ఎస్టీలుగా, రజకులను ఎస్సీ కేటగిరీలో చేర్చుతామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా తమ పార్టీ దశలవారీగా ఉద్యమించనున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేసేందుకు పోలీసుల అండంతో సాచివేతకు పాల్పడుతున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు.