ఆంధ్రప్రదేశ్‌

రాష్టవ్య్రాప్తంగా ఎల్‌ఇడి బల్బుల వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీల నుంచి మొదలుకుని నగర పాలక సంస్థల వరకు దశల వారీగా వీధి దీపాలకు ఎల్‌ఇడి బల్బులను వినియోగంలోకి తెస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. గృహసంబంధ వినియోగంలో ఇప్పటి వరకు సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను అందుబాటులోకి తేవడం వల్ల భారీ ఎత్తున విద్యుత్ వినియోగంలో ఆదా జరిగిందని అన్నారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తరఫున మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పారు. ఇప్పటి వరకు 91 లక్షల కుటుంబాలకు 1.82 కోట్ల ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎల్‌ఇడి వీధి దీపాల కార్యక్రమం కింద ఇప్పటి వరకు 3.81 లక్షల వీధిదీపాలను అమర్చామని చెప్పారు. పని చేయని పంపుసెట్ల స్థానంలో ఐఎస్‌ఐ మార్క్‌తో ఇంధన సామర్ధ్యం కలిగిన 5 స్టార్ రేటెడ్ పంప్ సెట్లను అమర్చడానికి 2016-17లో ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు.
టిడిపి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, రామాంజనేయులు, వైఎస్‌ఆర్‌సిపి సభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు అడిగిన ఉప ప్రశ్నలకు మంత్రి వివరణ ఇస్తూ కేంద్రం 2 లక్షల వ్యవసాయ పంపుసెట్లను ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. ఎస్‌సి సబ్‌ప్లాన్ నిధుల నుంచి అందిస్తున్న 50 విద్యుత్ యూనిట్ల ఉచిత వినియోగాన్ని 100 యూనిట్లకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. అలాగే విద్యుత్ మీటర్ల కోసం వినియోగదారులు వెచ్చిస్తున్న రూ.150ని సబ్‌ప్లాన్ నిధుల నుంచి వినియోగించి ఎస్‌సి లబ్ధిదారులకు అందించాలన్న ప్రశ్నకు వివరణ ఇస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రూ.125 మీటర్ల కొనుగోలు అందిస్తున్నట్లు చెప్పారు.