ఆంధ్రప్రదేశ్‌

సైనికులకు సంఘీభావంగా ఉరీకి బైక్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 22: దేశ సరిహద్దుల్లో పాక్ చొరబాటుదార్లను వీరోచిత పోరాటాల ద్వారా ప్రతిఘటిస్తున్న వీర సైనికుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తికావాలని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడ నుంచి కొద్దిరోజుల క్రితం కార్గిల్‌కు మోటారుబైక్‌లపై యాత్రచేసి సైనికులను కలుసుకుని వచ్చిన ఏపి ప్రతినిధి బృందాన్ని కన్నా అభినందించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు సముద్రాలు, సకల నదీ జలాలతో కాశ్మీర్‌లోని ఉరీకి వచ్చేనెల ఒకటో తేదీన గుంటూరు నుంచి 20 మందితో కూడిన బృందం బైక్ యాత్ర ప్రారంభిస్తుందని చెప్పారు. గుంటూరు నుంచి కన్యాకుమారి, నాగపూర్ మీదుగా కాశ్మీర్‌కు చేరుకుంటారని వివరించారు. దుబాయ్‌కు చెందిన ఓ యువకుడు కూడా యాత్రలో పాల్గొంటున్నట్లు చెప్పారు. అన్నిమతాలకు చెందిన వారు ప్రతినిధి బృందంలో ఉంటారన్నారు. వీరు ఉరీ చేరుకుని సముద్ర, నదీ జలాలతో వీరమరణం పొందిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తారని తెలిపారు. కాగా కార్గిల్ నుంచి తిరిగివచ్చిన రాజశేఖర్, సాయిప్రసాద్, వివేక్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, ఇమ్మానియేల్, చంద్రశేఖర్, రాజు, నరసింహారావు, గణేశ్, కుమార్, త్రిభువన్‌సింగ్ తదితరులను బిజెపి అర్బన్ జిల్లా పార్టీ అధ్వర్యంలో కన్నా శాలువలు, మెమెంటోలతో సత్కరించారు. కార్గిల్ బృందంపై తీవ్రవాదులు దాడిజరిపినా మొక్కవోని దీక్షతో జాతీయతా భావంతో యాత్రను పూర్తిచేయటం గర్వకారణమన్నారు. ఉరీ శ్రద్ధాంజలి యాత్ర కూడా సజావుగా సాగాలని ఆకాంక్షించారు.