ఆంధ్రప్రదేశ్‌

కర్నూలులో గుండె శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 23: రాయలసీమవాసులకు సంజీవనిగా పేరుగాంచిన కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో మొట్టమొదటి గుండె శస్తచ్రికిత్స విజయవంతమైంది. 60 ఏళ్ళ ఆసుపత్రి చరిత్రలో మొదటిసారి గుండె శస్తచ్రికిత్స విజయవంతం కావడంతో వైద్యులు విజయగర్వంతో సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలు నగరంలోని పాతబస్తీకి చెందిన షాదిజాబీకి చేసిన గుండె శస్తచ్రికిత్స విజయవంతమైంది. ఆసుపత్రి సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో కార్డియాలజి, కార్డియోథోరసిక్ సర్జన్ యూనిట్లు ఉన్నప్పటికీ సౌకర్యాలు లేక మూలనపడింది. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆసుపత్రి సూపరిటెండెంట్, కార్డియోథోరాసిక్ సర్జన్ డా.ప్రభాకర్‌రెడ్డి కృషి పట్టుదలతో థోరాసిక్ యూనిట్‌ను అభివృద్ధి చేయడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే స్థాయికి పెద్దాసుపత్రి ఎదిగిందని గర్వంగా చెప్పవచ్చు. పాలకులు, అధికారుల కృషితో కార్డియోథోరాసిక్ యూనిట్‌లో క్యాత్‌లాబ్ యంత్రాన్ని ప్రారంభించారు. దీంతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే ప్రక్రియ మొదలైంది.
గుండె శస్తచ్రికిత్స విజయవంతమైన సందర్భంగా శుక్రవారం ఆసుపత్రి కార్డియోథోరాసిక్ యూనిట్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కార్డియోథోరాసిక్ సర్జన్ డా.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి 60 ఏళ్ళ చరిత్రలో మొదటిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా చేశామన్నారు. సీనియర్ వైద్యుల సహకారంతో కార్డియోథోరాసిక్ యూనిట్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేసి శస్తచ్రికిత్సలు చేసే స్థాయికి తేవడం రాయలసీమ ప్రజలకు వరం అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఇక్కడ గుండె సంబంధ ఆపరేషన్లు చేస్తామన్నారు. రాయలసీమ ప్రజలు ఇకపై గుండె ఆపరేషన్లకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కర్నూలు ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు చేస్తామని గర్వంగా చెపుతున్నామన్నారు.
ఆసుపత్రి సూపరిటెండెంట్ డా.వీరస్వామి మాట్లాడుతూ ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ విజయంతం కావడం హర్షనీయమన్నారు. ఇది రాయలసీమ ప్రజలకు వరం అన్నారు. ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరి సహకారంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.

చిత్రం.. కర్నూలులో మహిళకు గుండె శస్తచ్రికిత్స చేసిన వైద్యుల బృందం