ఆంధ్రప్రదేశ్‌

నేను నిప్పును!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (పరవాడ), సెప్టెంబర్ 23: నేను నిప్పు, నాపై కేసులు పెట్టే దమ్ము ఎవరికి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విశాఖ జిల్లా పరవాడలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద 50.40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 1,839 గృహాల సముదాయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై నిప్పులు చెరిగారు. ‘నా జీవితంలో ఎప్పుడూ లాలూచీ పడలేదు. క్రమశిక్షణకు నేను మారుపేరు. నాపై ఒక్క కేసు కూడా లేదు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఒకేసారి 25 కేసులు పెట్టినప్పటికీ ఒక్కటీ నిరూపణ కాలేదు.. నేనా కేసులకు భయపడేది... ఇది చెల్లని మనుషులు చేస్తున్న చెడు ప్రచారం’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏపిలో ప్రజలు భూస్థాపితం చేసిన కాంగ్రెస్ పెద్దలా నన్ను విమర్శించేది అని ప్రశ్నించారు. వైకాపా నేత ఓ అవినీతిపరుడనీ, చిన్న పిల్లలను దొంగలుగా మార్చే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రత్యేక హోదా సాధన పేరుతో జగన్ జిల్లాలవారీగా ఏర్పాటు చేసే యువభేరి సదస్సుల్లో ఏమీ తెలియని పిల్లలకు దొంగతనాలను, తప్పుడు పనులను నేర్పించే అవకాశం ఉందన్నారు. ఈ సదస్సులకు మీ పిల్లలు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ‘నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదా.. నేను ఎస్వీ యూనివర్సీటీలో ఎంఎ, పిహెచ్‌డి పూర్తి చేశా. ప్రపంచ దేశాలు మెచ్చే ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది ఎవరు?’ అని ఆయన ఆవేశంగా అన్నారు. దేశంలోనే టాప్ సిఎంగా ఉన్నానన్నారు.

చిత్రం.. బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు