ఆంధ్రప్రదేశ్
పల్లెల్లో పంటల కొనుగోళ్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమరావతి, ఏప్రిల్ 13: గ్రామస్థాయిలో పంటల కోనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తరలించడంలో ఇబ్బందిపడే అవకాశం ఉండటంతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో 786 కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 700 కేంద్రాలను ఏర్పాటు చేయగా, మరో రెండు రోజుల్లో మిగిలినవి ఏర్పాటు కానున్నాయి. ఈ కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చూసేందుకు ముందుగా రైతుల పేర్లు నమోదు చేసుకుంటారు. నిర్ణయించిన సమయం, తేదీల్లోనే రైతులు తన పంటను ఈ కేంద్రాలకు తరలించాలి. స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంణగాలు, రైతు ఉత్పత్తి సంఘాలకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తోంది. మొక్కజొన్న 3.64 లక్షల టన్నుల మేర కొనుగోలు చేసుందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1.5 లక్షల మెట్రిక్ టన్నుల జోన్నల కొనుగోలుకు 95 కేంద్రాలను ఏర్పాటు చేసింది. శనగలకు 185, కందులకు 140, పసుపుకి 11, అపరాలకు 5 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. క్వింటాల్ మొక్కజొన్నకు 1760 రూపాయలు, జొన్నకు 2550 రూపాయలుగా మద్దతు ధరగా ప్రకటించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన శనగల్లో 14500 టన్నులను పౌరసరఫరాల శాఖకు మార్క్‌ఫెడ్ సరఫరా చేస్తోంది. గ్రామస్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మార్క్‌ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న తెలిపారు. వర్షాల వల్ల పంట దెబ్బతినకుండా కొనుగోలు చేసిన పంటలను గోదాములకు తరలిస్తామన్నారు. హమాలీల సమస్య లేకుండా వ్యవసాయ కార్మికులను ఏజన్సీలు వినియోగించుకునే ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు.
పట్టణాల్లో 20వేల వైఎస్సార్ జనతా బజార్లు
పట్టణ ప్రాంతాల్లో రైతుల ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు 20వేలకు పైగా వైఎస్సార్ జనతా బజార్లను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ రైతుబజార్ల ఏర్పాటుపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం చర్చించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్ చైన్, ప్రాసెసింగ్ నెట్‌వర్కులను పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 11వేలకు పైగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని, వీటిలో జనతా బజార్లు పెట్టే దిశగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వార్డు సచివాలయాల పక్కన కూడా జనతా బజార్లు ఏర్పాటు చేయాలన్నారు. మండల కేంద్రాల్లో పెద్దస్థాయిలో జనతా బజార్లు ఏర్పాటు చేయాలన్నారు. దాదాపు 22వేల జనతా బజార్లతో పెద్ద నెట్‌వర్కు ఏర్పడుతుందన్నారు. ఈ బజార్లలో శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పాలు, పళ్లు, కూరగాయలు, తదితర నిల్వకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులు అమ్ముకునే సరకులను గోదాములకు తరలించేందుకు ఈ వాహనాలు ఉపయోపడతాయన్నారు. పెద్దఎత్తున మార్కెట్ అవకాశాలు కరోనాను ఎదుర్కొనే రూపంలో అందుబాటులోకి వచ్చాయన్నారు. రైతులకు మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు రాకుండా తొలగిపోతాయన్నారు. లాభనష్టాలు లేని రీతిలో నిర్వహిస్తే ప్రజలకు మంచి ధరల్లో నిత్యావసరాలు లభిస్తాయన్నారు.
*చిత్రం...ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి