ఆంధ్రప్రదేశ్‌

అత్యుత్తమ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ నివారణ చర్యలపై సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కోవిడ్ బాధితుల కోసం కనీసం 400 బెడ్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఎన్-95 మాస్క్‌లు కూడా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేలా చూడాలన్నారు. సంబంధిత పరిశ్రమలతో మాట్లాడి ఇక్కడే ఉత్పత్తి చేయించాలన్నారు. క్వారంటైన్, ఐసోలేషన్ సమస్య ఉండకూడదని చెప్పారు. కుటుంబ సర్వే ద్వారా ముందుగా వ్యాధి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలన్నారు. వివిధ దేశాల్లోని అత్యున్నత చికిత్సా పద్ధతులను పరిశీలిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. రోజుకు 1200 వరకూ పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరాకు లోటు లేకుండా చూస్తున్నామన్నారు. అరటిని స్థానిక మార్కెట్లకు పంపించే ప్రయత్నాలు కొనసాగించాలని ఆదేశించారు.
ఎక్కడెక్కడ మార్కెటింగ్‌కు అవకాశం ఉందో మ్యాపింగ్ చేయాలన్నారు. బయట రాష్ట్రాలకు చేపల రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ మార్కెట్లు తెరిచేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాలకు రొయ్యల ఎగుమతిపై ప్రయత్నాలు ప్రారంభించాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి దుకాణం వద్ద ధరల బోర్డులను పెట్టాలని, ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. ఎవరైనా రేషన్ అడిగితే పరిశీలించి ఇవ్వాలన్నారు. రేషన్ ఇచ్చిన అందరికీ 1000 రూపాయలు కూడా అందేలా చూడాలన్నారు. అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.