ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల నిర్వహణకు సిద్ధంకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించినా అధికారులు సన్నద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ వి కనగరాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, పరిస్థితులు కుదుటపడిన తరువాత ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాల్సి వొచ్చినా అందుకు సర్వ సన్నద్దంగా ఉండాలన్నారు. ఎన్నికల సంఘం కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా విజయవాడలోని ఆర్ అండ్ బి భవన్‌లోని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కార్యాలయంలో సోమవారం ఎన్నికల సంఘం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ వి కనగరాజ్ మాట్లాడుతూ అధికారులు అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో సమర్ధవంతంగా విధుల్లో భాగస్వామ్యం కావాలన్నారు. ఒకరి కొకరం సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం అవుదామన్న ఆయ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాల్సి వొచ్చినా అందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితి నెలకొందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనలో పంచాయితీ రాజట్ వ్యవస్థ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరాలని, స్థానిక సంస్థలు ఏర్మాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయితీలకు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాల్సి వొచ్చినా అందుకు అధికారులు, సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. సమయానికి అనుగుణంగా కార్యచరణ ప్రణాళికలు ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కీలక భూమిక పోషిస్తుందన్నారు. చక్కటి అవగాహనతో రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు పేరును తీసుకొని రావడంలో అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యాదార్థ పరిస్థితిని అధికారులు కమీషనర్‌కు పూర్తిగా వివరించారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల కమిషనర్ కనగరాజ్