ఆంధ్రప్రదేశ్‌

అప్పటి త్యాగాల ఫలితమే ఇప్పటి స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: అప్పుడు లక్షలాది మంది చేసిన ప్రాణ త్యాగాల ఫలితంగా మనం ఈరోజు సేచ్ఛను అనుభవిస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. జలియన్ వాలాబాగ్‌లో కాల్పుల్లో అమరులైన వారికి నివాళులు అర్పిద్దాం అంటూ సోమవారం ట్విట్టర్‌లో ది గార్డియన్ - లండన్ అనే కథనాన్ని పోస్టు చేశారు. బ్రిటీష్ ఇండియా చరిత్రలో ఒక అమానుష దుశ్చర్యగా మిగిలిపోయిన జలియన్ వాలాబాగ్ విషాద ఘటన అంటూ ట్వీట్ చేశారు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్, అమృతసర్‌లో జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగిందన్నారు. నేటికి ఈ ఘటన జరిగి 101 ఏళ్లుగా తెలిపారు. లక్షలాది మంది చేసిన ప్రాణ త్యాగాల ఫలితంగా మనం ఈ రోజు స్వాతంత్య్రాన్ని సాధించామన్నారు. ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నామన్నారు. జలియన్‌వాలాబాగ్ వంటి వీర చరిత్రలు మనకు స్ఫూర్తివంతం కావాలంటూ ఆయన ఆకాంక్షించారు. జలియన్ వాలాబాగ్‌లో కాల్పుల్లో అమరులైన వారిని స్మరించుకుంటున్నాం, వారికి నివాళులు అర్పిస్తున్నాం సెల్యూట్ జైహింద్ అని ట్వీట్ చేశారు.