ఆంధ్రప్రదేశ్‌

ఆగిన వాన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: గోదావరి జిల్లాల్లో గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలు శనివారం తగ్గుముఖం పట్టాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినా పొలాలు మాత్రం నీటితో నిండిపోయి వున్నాయి. నీటి కుంటలుగా మారిన పొలాల్లోంచి నీరు తగ్గితే తప్ప రైతుల్లో ఆందోళన తప్పని పరిస్థితి నెలకొంది. ఇంకా మూడు నాలుగు రోజుల పాటు నీరు నిల్వ వున్నప్పటికీ ఆపై నీరు మడుల నుంచి తొలగకపోతే మాత్రం వరికి నష్టం వాటిల్లే పరిస్థితి వుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో నాలుగు రోజుల వరకు నీటిలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఆపై వుంటేనే కాస్తంత నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుందని సూచించారు. నీరు సత్వరం లాగే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పొట్ట దశలో వుంది. భారీ వర్షాలకు రంగంపేట మండలంలో చాగల్నాడు కాలువకు గండిపడింది. సమీపంలో వున్న చెరువులు కూడా నిండుగా మారి పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో వరద నీటి ప్రవాహ ఉద్ధృతి నిలకడగావుంది. ఎగువ ప్రాంతంలో తగ్గుముఖం పట్టింది. శనివారం భద్రాచలం వద్ద 22 అడుగుల నీటి మట్టం కాస్తా మధ్యాహ్నానికి 21 అడుగులకు తగ్గింది.
హంద్రీనీవా ఫేజ్-2కు నీరు విడుదల
ఆత్మకూరు: హంద్రీనీవా ఫేజ్-2 ద్వారా శనివారం గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు విడుదల చేశారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి తదితరులు ఆత్మకూరు మండలం సింగంపల్లి వద్ద గంగమ్మకు పూజ చేసి నీరు విడుదల చేశారు. అనంతరం రైతులతో కలిసి కాలువ గట్టు వెంబడి మంత్రి సునీత పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ అనంతను కరవురహిత జిల్లాగా మార్చేందుకు హంద్రీనీవా ఫేస్-2 ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు తరలిస్తున్నామన్నారు.