ఆంధ్రప్రదేశ్‌

అంతా అమ్మవారి దయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదవేగి/ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 25 : ఒలింపిక్ క్రీడల్లో భారత్ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి ఇనుమడింపచేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఆదివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసియున్న శ్రీ రాట్నాలమ్మ అమ్మవారికి, ద్వారకాతిరుమలలో చినవెంకన్నకు విశేష పూజలు నిర్వహించారు. రాట్నాలకుంట చేరుకున్న సింధూకు రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సింధూ భక్తిశ్రద్ధలతో రాట్నాలమ్మ అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు. అమ్మవారికి ప్రీతికరమైన పొంగలి నైవేద్యాన్ని తలపై పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి రాట్నాలమ్మ అమ్మవారి కరుణకోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ క్రీడాకారిణి సింధూను ఘనంగా సత్కరించి రాట్నాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. అడుగడుగునా సింధూకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సింధూ మాట్లాడుతూ రాట్నాలమ్మ అమ్మవారి దయ వలన తాను ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. అలాగే జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం ఆమె కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన సింధూకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.

చిత్రం..రాట్నాలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు అమ్మవారికి ఇష్టమైన పొంగలి ప్రసాదాన్ని తలపై పెట్టుకుని ఆలయానికి వస్తున్న సింధు