ఆంధ్రప్రదేశ్‌

ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 25 : ద్వై వార్షిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పదవీ కాలం పూర్తవుతున్న ఉపాధ్యాయ(టీచర్), పట్ట్భద్రులు(గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభం కానుంది. 2017 మార్చి 29వ తేదీ నాటికి ఆయా స్థానాల్లో ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుంది. ఆ లోగా ఈ నియోజకవర్గాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అందులో 2 ఉపాధ్యాయ, 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. అనంతపురం, కడప, కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం టీచర్స్, గ్రాడ్యుయేట్ స్థానం నుంచి కడపకు చెందిన బచ్చల పుల్లయ్య, గ్రాడ్యుయేట్ స్థానం నుంచి అనంతపురానికి చెందిన డాక్టర్ గేయానంద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ స్థానానికి పి.శ్రీనివాసరెడ్డి, టీచర్స్ నియోజకవర్గానికి పి.బాలసుబ్రహ్మణ్యం, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ స్థానానికి ఎంపిఎస్ శర్మ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. ఈ 5 స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు ప్రక్రియ మొదలుకానుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 5వ తేదీ వరకూ ఓటరు నమోదు, నవంబర్ 23వ తేదీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన ఉంటుందని సమాచారం. ఓటర్ల తుది జాబితాను డిసెంబర్ నెలాఖరు లోపు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో గ్రాడ్యుయేట్ స్థానానికి పోటీ చేసేందుకు ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు.