ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యే భూమాపై రౌడీషీట్ ఎత్తివేతకు రంగం సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 25: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు నమోదు చేసిన రౌడీషీట్ ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. ఆయనపై సుమారు రెండేళ్ల క్రితం పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. ఆ కేసులో భూమా నాగిరెడ్డి రిమాండుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఆయన వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత ఆయనను మంత్రివర్గంలో చేర్చుకుంటారని ప్రచారం జరిగింది.
గత జూన్‌లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించినా జాప్యం జరుగుతూ వచ్చింది. తాజాగా దసరా పండుగ నాటికి మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ముగించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని దీనిపై కసరత్తు చేస్తున్నారని టిడిపి వర్గీయుల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలో భూమా నాగిరెడ్డిని కాకుండా ఆయన కుమార్తె భూమా అఖిలప్రియను మంత్రివర్గంలో చేర్చుకోవాలన్న ఆలోచన కూడా సిఎం చేసినట్లు తెలుస్తోంది.
అయితే జిల్లాలో టిడిపి బలం పెరగాలంటే నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తే పార్టీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని పార్టీ సీనియర్లు ఇచ్చిన సలహా మేరకు చంద్రబాబు మనసు మార్చుకున్నారని సమాచారం. అయితే మంత్రిగా రౌడీషీట్ ఉన్న ఎమ్మెల్యేకు అవకాశమిస్తే ఆరోపణలు వస్తాయన్న కారణంగా నిబంధనల ప్రకారం రౌడీషీట్ ఎత్తివేతకు పోలీసులు చర్యలు తీసుకోవాలన్న సూచన మేరకు నంద్యాల పోలీసులు ఆ మేరకు నివేదిక సిద్ధం చేసి జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణకు పంపినట్లు తెలుస్తోంది. ఆ నివేదికను ఎస్పీ పరిశీలించి సంతృప్తి చెందితే రౌడీషీట్ ఎత్తివేతకు పోలీసులకు ఆదేశాలు జారీ అవుతాయని ఆ శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. దీనిపై కొద్ది రోజుల్లోనే నిర్ణయం వెలువడుతుందని వారంటున్నారు. దీంతో భూమా నాగిరెడ్డి మంత్రిపదవికి లైన్ క్లియర్ అవుతుందని టిడిపి నేతలు స్పష్టం చేస్తున్నారు.