ఆంధ్రప్రదేశ్‌

లక్ష్యాలు పెంపు... ఖజానా నింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: రాష్ట్ర ఖజానాను నింపుకునేందుకు ఎపి ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గణనీయంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, వ్యాట్ విభాగాల లక్ష్యాలను అమాంతం పెంచడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్సైజ్ శాఖ అయితే ఎకాఎకిన రూ. 1100 కోట్లు ఎక్కువగా ఆదాయాన్ని వసూలు చేయాలని నిర్ణయించింది. ఏ వస్తువులు కొనుగోలు చేసినా వ్యాట్ పన్నులు చెల్లించక తప్పదు. అదే విధంగా మద్యం వీలైనంత ఎక్కువగా సేవిస్తేనే రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం పెరుగుతుంది. పన్నుల రాబడుల లక్ష్యాన్ని పెంచడమంటే ప్రజలు జల్సాగా జీవించి డబ్బు ఖర్చుపెట్టే విధానాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 5756 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ ద్వారా సాధించాలని నిర్దేశించారు.
ఇక వ్యాట్ సంగతి సరేసరి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 37,435 కోట్ల రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది రూ. 32840 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, గత నెలాఖరువరకు రూ. 28వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాదిపైన వచ్చే ఏడాది వ్యాట్ ద్వారా అదనంగా రూ. 8500 కోట్ల ఆదాయం పెంచాలని వాణిజ్య శాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రవాణా రంగం ద్వారా వచ్చే ఏడాది రూ. 2412 కోట్ల ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది రూ. 1977 కోట్ల రెవెన్యూ లక్ష్యంగా కాగా ఇంతవరకు రూ. 1950 కోట్ల ఆదాయం వసూలైంది.
ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ రెవెన్యూ లక్ష్యాన్ని కూడా పెంచేశారు. 2016-17 సంవత్సరానికి రూ. 5180 కోట్ల ఆదాయాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఈ ఏడాది రూ. 3500 కోట్ల ఆదాయం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇంతవరకు రూ. 3300 కోట్ల ఆదాయం వచ్చింది. రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ప్రోత్సహించి, భూముల క్రయ విక్రయాలు బాగా జరగాలంటే రేట్లు తక్కువగా ఉండాలి. కాని అమరావతి రాజధాని ప్రాంతంతో పాటు విశాఖ, రాజమండ్రి, తిరుపతి తదితర నగరాల్లో భూముల రేట్లు గణనీయంగా పెరిగాయి. దీని వల్ల అదనంగా రెవెన్యూ రాబడి లక్ష్యం రూ. 1600 కోట్లను పెంచాలన్న లక్ష్యం నెరవేరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.