ఆంధ్రప్రదేశ్‌

ఆకర్షణీయంగా మ్యాన్‌హోల్ కవర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 26: జపాన్‌లో మురుగునీటి పారుదల పైప్‌లైన్ల మ్యాన్‌హోల్ కవర్లు కూడా కళాఖండాలుగా తీర్చిదిద్దుతున్నారు. సృజనాత్మకతను జోడించి సాధారణ రోడ్లలోని మ్యాన్‌హాల్ కవర్లను ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. జపాన్‌లో మ్యాన్‌హోల్ కవర్ల డిజైన్ కోసం పోటీల నిర్వహణతో ప్రత్యేకంగా ఒక సొసైటీ ఉండటం గమనార్హం. మాన్ హోల్ కవర్లకు స్వల్ప మార్పులు చేస్తే రాష్ట్రంలోనూ రోడ్లు మరింత అందంగా కనపించడంతో పాటు భారీ వర్షం సమయంలో ఈ మ్యాన్‌హోల్స్‌లో పడే ప్రమాదాలను కొంతమేరకు నివారించవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని నగరాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థలో భాగంగా రోడ్లపై మాన్‌హోల్స్‌ను ఏర్పాటు చేయడం తెలిసిందే. వీటిపై కవర్లను కొన్ని చోట్ల ఇనుముతో, కాంక్రీట్‌తో వేస్తుంటారు. వాహనాల బరువును తట్టుకునేలా కవర్లను డిజైన్ చేయకపోవడం గమనార్హం. అయితే జపాన్‌లో ఇందుకు భిన్నగా మ్యాన్‌హోల్ కవర్లను కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. జపాన్‌లోని 1700కుపైగా ఉన్న మున్సిపాలిటీల్లో 12 వేల రకాల మ్యాన్‌హోల్ కవర్లను డిజైన్ చేసి వినియోగిస్తున్నారు. మురుగునీటి పారుదల వ్యవస్థ ప్రాధాన్యత, అందుకైన ఉపయోగించిన విలువైన ప్రజాధనం గురించి తెలియచేప్పేందుకు మ్యాన్‌హాల్ కవర్లను తీర్చిదిద్దుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రాముఖ్యతను తెలియచేసే విధంగా ఈ కవర్లను మెటల్ లేదా కాంక్రీట్‌తో తయారుచేస్తారు. ఇందుకు ఆయా మున్సిపాలిటీలు విద్యార్థులకు పోటీలను నిర్వహించి డిజైన్లను ఆహ్వానిస్తాయి. మున్సిపాలిటీల మధ్య కూడా ఈ విషయమై పోటీ పడుతుంటారు. జపాన్ సొసైటీ ఆఫ్ మ్యాన్‌హోల్ కవర్స్ అనే ఒక సొసైటీ కూడా పని చేస్తోంది. మ్యాన్ హోల్ కవర్లతో ఒక మ్యూజియం కూడా నిర్వహిస్తున్నారు. కవర్ డిజైన్లలో ఎక్కువగా ల్యాండ్‌స్కేపింగ్, చెట్లు, పక్షులు, ఆయా ప్రాంతాల్లోని ప్రాముఖ్యత కలిగిన అంశాలతో రూపొందిస్తారు. ఇటీవల కాలంలో ఈ కవర్లకు చిప్ ఏర్పాటు చేసి మురుగునీటి పైప్‌లైన్లలోని నీటి మట్టాలను, ఇతర అంశాలను రియల్‌టైమ్ మానిటరింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఆకస్మికంగా భారీవర్షం సంభవిస్తే ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకునే వీలు కలుగుతోంది. స్మార్ట్ నగరాల్లో ఇటువంటి మ్యాన్‌హోల్ కవర్లను వినియోగించడం వల్ల రహదారులు అందంగా ఉండటమే కాకుండా, కవర్ డిజైన్‌లో పసుపు రంగు ఉండేలా చర్యలు తీసుకుంటే వర్షపు నీటిలో కూడా మ్యాన్‌హోల్ కవర్ ఉందా లేదా అన్న అంశాన్ని గమనించే వీలు ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించాల్సి ఉంది.

చిత్రం.. జపాన్‌లో ఏర్పాటు చేసిన మ్యాన్‌హోల్ కవర్లు