ఆంధ్రప్రదేశ్‌

దివ్యాంగ విద్యార్థులకు ఎస్కార్ట్ అలవెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నుండి 9, 10 తరగతులు చదివే దివ్యాంగ పిల్లలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ప్రాజెక్టు కింద ఎస్కార్ట్, ట్రావెల్ అలవెన్స్‌లను చెల్లించనున్నారు. 1 నుండి 8వ తరగతి చదివే ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలకు సర్వ శిక్షా అభియాన్ ఏటా ఎస్కార్ట్, ట్రావెల్ అలవెన్స్‌లను చెల్లిస్తోంది. 9, 10 తరగతులు చదివే పిల్లలకు మాత్రం ఇంతవరకూ ఎలాంటి అలవెన్స్‌లు లేవు. అయితే ఈ ఏడాది నుండి చెల్లించడానికి ఆర్‌ఎంఎస్‌ఎ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2016-17 విద్యాసంవత్సరంలో 9, 10 తరగతులు చదివే దివ్యాంగులు మొత్తం 10,187 మంది ఉన్నారు. వీరిలో 2071 మంది అర్హులున్నట్టు గుర్తించారు. ఒకొక్కరికి నెలకు ఎస్కార్ట్ అలవెన్స్ కింద రూ.300, ట్రావెల్ అలవెన్స్ కింద 2200 మందికి ఒకొక్కరికి రూ.300 చొప్పున చెల్లిస్తారు. ఇందుకు కోటి 29 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. మరోవైపు దివ్యాంగులైన 5270 మంది ఆడపిల్లలకు నెలకు రూ.200 అదనపు స్ట్ఫైండ్ చెల్లించాలని కూడా నిర్ణయించారు. ఇందుకోసం 1.54 కోట్లు ఖర్చు కానుంది. అయితే డబ్బు నెలవారీ నేరుగా పిల్లలకే చెల్లించేలా వారి బ్యాంకు అకౌంట్, ఆధార్ వివరాలు సేకరిస్తున్నారు. అక్టోబర్‌నాటికి అలవెన్స్‌లు అందించే కార్యక్రమం ప్రారంభించనున్నారు.