ఆంధ్రప్రదేశ్‌

కలెక్టరేట్‌ల వద్ద ఇద్దరు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు/ఒంగోలు , సెప్టెంబర్ 26: అప్పులోళ్ల బాధలు భరించలేక కలెక్టరేట్‌ల వద్ద ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయ. ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం ఒక వ్యక్తి చెదల నివారణకు ఉపయోగించే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అతడిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, కోలుకుంటున్నాడు. తాడేపల్లిగూడెంనకు చెందిన అచ్యుత నాగరాజు వడ్రంగి పనిచేస్తుంటాడు. కొంతకాలం క్రితం ఇతను హైదరాబాద్‌కు చెందిన మాధవీలత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2014లో వారిద్దరూ నిడదవోలు మండలం ఆట్లపాడు గ్రామానికి వచ్చి స్ధిరపడ్డారు. అదే గ్రామంలో 68 గజాల స్థలం కొనుగోలుచేసి, ఇల్లు నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణం నిమిత్తం ఒకరి వద్ద రూ.2.5 లక్షలు, మరొకరి వద్ద రూ.90వేలు, మరొకరి వద్ద రూ.50 వేలు అప్పుతీసుకున్నారు. తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లిస్తున్నారు. కొద్దికాలం క్రితం నాగరాజు ఇంటి మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. శస్తచ్రికిత్స జరగడంతో పనిలోకి వెళ్లడంలేదు. దీనితో కొంతకాలంగా అప్పులకు వడ్డీ చెల్లించడంలేదు. దీనితో వెంటనే అప్పు చెల్లించకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని అప్పు ఇచ్చినవాళ్లు బెదిరిస్తూ వచ్చారని మాధవీలత చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేసింది. తమకు న్యాయం చేయాలంటూ మీకోసం కార్యక్రమంలో రెండుసార్లు ఫిర్యాదుచేశారు. అనంతరం 2016 జూలై 21న ఒక పోలీసు అధికారి వద్ద సెటిల్‌మెంట్ జరిగి 15రోజుల్లో సొమ్ము చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. గత ఆగస్టు 5వ తేదీతో గడువు ముగియనుండటంతో డబ్బులు లేక నాగరాజు, మాధవీలత గ్రామం విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆగస్టు 11వ తేదీన తాళాలు పగులగొట్టిన బాకీదారులు ఇంటిని స్వాధీనం చేసుకున్నారని మాధవీలత పేర్కొన్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మీకోసం కార్యక్రమానికి మరోసారి వచ్చి ఫిర్యాదు చేయగా కలెక్టరు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి చెప్పారని తెలిపింది. మరోసారి మీకోసంలో ఫిర్యాదు చేయడానికి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన దంపతులిద్దరూ సమావేశమందిరం వద్దకు చేరుకునే సమయంలోనే నాగరాజు ఒక్కసారి తన వెంట తెచ్చుకున్న చెదల నివారణ మందు తాగేశాడు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా నాగరాజు వద్ద సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.
ఒంగోలులో..
ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టరేట్ వద్ద గల గ్రీవెన్స్ సెల్ వద్ద సోమవారం క్లౌపేటకు చెందిన జి నరేష్ (20) అనే యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. ఒంగోలు టూ టౌన్ సిఐ దేవ ప్రభాకర్ అందించిన వివరాల ప్రకారం ఒంగోలు నగరంలోని క్లౌపేట 6వ లైన్‌కు చెందిన జి నరేష్ అనే వ్యక్తి ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఒక టిఫిన్ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. అయితే క్లౌపేటలోని పార్వతీ అనే ఆమె దగ్గర గత రెండు సంవత్సరాల క్రితం సుమారు ఒక లక్షా 60 వేల రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. ఇందుకోసం తన ఇంటి డాక్యుమెంట్స్ ష్యూరిటీగా పెట్టాడు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో డబ్బులైనా ఇవ్వాలి లేదా ఇంటిని పార్వతి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని నరేష్‌పై ఆమె ఒత్తిడి తీసురాసాగింది. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడానికి గత వారం జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో నరేష్ ఒక అర్జీని కూడా ఇచ్చాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం తిరిగి గ్రీవెన్స్ సెల్‌లో నరేష్ అర్జీ ఇచ్చేందుకు జిల్లా కలెక్టరేట్‌కు వచ్చాడు. లైన్‌లో నిలబడి పురుగుల మందు తాగి స్పృహ తప్పి పడిపోతున్న నరేష్ ను పోలీసులు గమనించి, చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నరేష్ రిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.

చిత్రం.. ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజు