ఆంధ్రప్రదేశ్‌

ల్యాండ్ పూలింగ్‌కు ‘మడ’ రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 26: బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించేందుకు మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) సిద్ధమైంది. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన 33 వేల 337 ఎకరాల భూములకు సంబంధించి వారం రోజుల క్రితం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసిన మడ అధికారులు మంగళవారం నుండి గ్రామసభల నిర్వహణకు సిద్ధమయ్యారు. మూడురోజుల పాటు నిర్వహించనున్నారు. సంబంధిత రైతుల నుండి అంగీకార పత్రాలు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఇందుకుగాను సోమవారం ఫారం-2 (అభ్యంతర పత్రం), ఫారం-3 (అంగీకార పత్రం)లను మడ వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు విడుదల చేశారు. బందరు మండలంలోని 27 గ్రామాలతో పాటు పెడన మండలం కాకర్లమూడి గ్రామంతో కలుపుకుని మొత్తం 28 గ్రామాల్లో 33వేల 337 ఎకరాల భూముల సమీకరణకు మడ అధికారులు గత సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 28 గ్రామాలను పది యూనిట్లుగా విభజించారు. ప్రతి యూనిట్‌కు ఒక డిప్యూటీ కలెక్టర్‌ను నియమించారు. తమకు కేటాయించిన యూనిట్ల వారీగా ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 4 వరకు అంగీకార పత్రాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు తెలిపిన రైతులతో అక్టోబర్ 10న సమావేశమై సంబంధిత అభ్యంతరాలపై విచారణ నిర్వహిస్తారు. డిప్యూటీ కలెక్టర్ ధర్మారావు అధ్యక్షతన ఈ నెల 27న చిలకలపూడి, 28న పోతేపల్లి, మాచవరం, 29న పల్లితుమ్మలపాలెం గ్రామాల్లో, డిప్యూటీ కలెక్టర్ నరేంద్రప్రసాద్ అధ్యక్షతన 27న బుద్దాలపాలెం, 28న కాకర్లమూడి, 29న గోకవరం గ్రామాల్లో, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి అధ్యక్షతన 28న బందరు వెస్ట్‌లో, డిప్యూటీ కలెక్టర్ సమజ అధ్యక్షతన 28న మంగినపూడి, 29న గోపువానిపాలెం, 30న తవిసిపూడిలో, డిప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి అధ్యక్షతన 27న పోలాటితిప్ప, 28న కరగ్రహారం, 29న రుధ్రవరం, గుండుపాలెం గ్రామాల్లో, డెప్యూటీ కలెక్టర్ సుజాత అధ్యక్షతన 27న అరిసేపల్లి, హుస్సేన్‌పాలెం, 28న బొర్రపోతుపాలెం, 29న పొట్లపాలెం, కొత్తపూడి గ్రామాల్లో, డెప్యూటీ కలెక్టర్ సుబ్బరాజు అధ్యక్షతన 27న కోనలో గ్రామసభలుంటాయ.