ఆంధ్రప్రదేశ్‌

విమానాల్లో చక్కర్లతో సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురజాల, సెప్టెంబర్ 26: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో భారీ వర్షాలతో వచ్చిన వరదలకు పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, ప్రభుత్వం మాత్రం రైతులను పూర్తిగా విస్మరించిందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శించారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సోమవారం గురజాల వచ్చిన ఆయన పట్టణంలోని బ్రహ్మనాయుడు విగ్రహం సెంటర్‌లో మాట్లాడారు. పులిచింతలలో 45 టిఎంసిల నీరు నిల్వ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ 30 టిఎంసిలు మాత్రమే నిల్వచేసి మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు. అంతేగాక 20వేల టిఎంసిల దాకా గోదావరి జలాలను కూడా వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు. ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో సరిపడా వర్షాలు లేకపోయినప్పటికీ రైతులు ఎన్నో ఇబ్బందులుపడి కాపాడుకున్న పంటలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయాయన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా ప్రత్తి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాలు, హెలికాప్టర్లలో మాత్రమే చక్కర్లుకొడుతున్నారంటూ విమర్శించారు. రాష్ట్రంలో గత ఏడాది రైతులకు ఇవ్వవలసిన దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీని ఇంతవరకు అందించలేదన్నారు. రుణమాఫీ చేయకపోగా రెన్యువల్ కాని రుణాలపై బ్యాంకర్లు రైతుల నుండి వడ్డీలపై వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. కొత్త అంబాపురం, గంగమహేశ్వరపురం గ్రామంలో కొద్దిసేపు ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రైతులకు జగన్ పరామర్శ
దాచేపల్లి : దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో వరద వల్ల నష్టపోయిన పంట పొలాలను వైకాపా అధినేత జగన్ సోమవారం పరిశీలించారు. స్వయంగా ఆయన పొలాల్లో నడుచుకుంటూ వెళ్లి అక్కడున్న రైతులతో మాట్లాడారు. వర్షాల వల్ల ఉడికెక్కిన పత్తి మొక్కలను జగన్‌కు చూపించి తాము భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జగన్ రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం కంటితుడుపు చర్యలు మాత్రమే చేపడుతోందని, రైతులను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేయడంలేదని విమర్శించారు. వేలాది ఎకరాల పంటలు వరదలో మునిగిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్రం.. ముత్యాలంపాడులో పత్తిపంటను పరిశీలిస్తున్న జగన్