ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయానికే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 26: ‘వ్యవసాయ రంగంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం. జాతీయ స్థాయిలో వృద్ధిరేటు గణనీయంగా తగ్గింది. విశ్వవిద్యాలయాలు స్వయం పోషకత్వంతో నిత్యనూతన పరిశోధనలను ఆవిష్క రించాలి. నాణ్యమైన విత్తనోత్పత్తితోనే లాభసాటి వ్యవసాయం చేయగలం. ఆ దిశగా అవసరమైన శాస్త్ర, సాంకేతికతలను జోడించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు కృషి జరగాలి’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సోమవారం గుంటూరు జిల్లా బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 48వ స్నాతకోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ‘ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు క్షేత్రస్థాయికి దూరంగా ఉన్నాయి. విద్యార్థులు ల్యాబ్‌లకే పరిమితమవుతున్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పనతో పాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే పంటలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆయనన్నారు. ఆక్వా రంగంలో దేశంలోనే ముందున్న రాష్ట్రం వ్యవసాయకంగా ఒడిదుడుకులను ఎదుర్కుంటోందని, ఇందుకు కారణాలు, లోటుపాట్లను గుర్తించాలన్నారు. సూక్ష్మ పోషక పదార్థాలతో పాటు భూసార పరీక్షలు నిర్వహించి సంప్రదాయక వ్యవసాయంపై మొగ్గుచూపే దిశగా రైతులను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. రసాయనాలు, క్రిమిసంహారక మందులు అధికంగా వాడటం వల్ల భూసారం క్షీణిస్తోందని, ఆహార ఉత్పత్తుల్లో పోషక విలువలు లోపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల దిగుబడి కూడా తగ్గుతోందన్నారు. ‘నీటితోనే సాగు ముడిపడి ఉంది. అనేక సందర్భాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి. సమస్యను అధిగమించేందుకే భూగర్భ జలాలను పెంపొందించాలని లక్ష్యాలను నిర్దేశించాం’ అని చెప్పారు. సూక్ష్మపోషక లోపాలు, నీటి ఎద్దడి, వరదలు, నేల, కలుపు సమస్యలు, తెగుళ్లు, పురుగులు, విత్తన నాణ్యత లేక పోవటం వల్లే వ్యవసాయం దెబ్బతింటోందని వివరించారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అవగాహన కొరవడిందన్నారు. ప్రాథమిక రంగంలో ఉత్పత్తిని పెంచి నీటి సంరక్షణ, సూక్ష్మనీటి సాగు ద్వారా కరవు పరిస్థితులను అధిగమించేలా చర్యలు చేపట్టామన్నారు.
రైతులకు అండగా ఉంటాం
కాకుమాన: రైతుల పక్షపాత ప్రభుత్వం తెలుగుదేశం అని, నవ్యాంధ్రను నిర్మించటంతో పాటు రైతులకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి రైతులకు మేలుకలిగేలా నీరు అందించడంతో సాగు సమస్య పరిష్కారమైందని, పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తిచేసి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా కాకుమానులో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంపునకు గురైన పొలాలను పరిశీలించామని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నల్లమడ డ్రైనేజీని పూర్తిగా ఆధునీకరిస్తానని చెప్పారు. ప్రతి ఏటా నల్లమడ డ్రైనేజీ వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గండ్లుపడి పొలాలు నష్టపోతున్నారని అన్నారు.

చిత్రం.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ
స్నాతకోత్సవ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు