ఆంధ్రప్రదేశ్‌

రాజధాని రైతులకు ప్లాట్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 27: రాజధాని నగర పరిధిలోని పిచ్చుకలపాలెం, దొండపాడు గ్రామాల్లో భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు మంగళవారం ప్లాట్లు పంపిణీ చేశారు. తుళ్లూరు ఎపి సిఆర్‌డిఎ కార్యాలయంలో కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు జరిపారు. కొత్త లే అవుట్‌లో సుహృద్భావ వాతావరణం ఉండేవిధంగా డిజైన్ చేశామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన నగర ప్రణాళిక ఏర్పాట్లపై ఆసక్తి చూపుతున్నారని ఇప్పటికే చాలా దేశాలు తమ ప్రతినిధులను పంపుతున్నట్లు తెలిపారు. అమరావతి నగర నిర్మాణంలో సుప్రసిద్ధ డెవలపర్లను భాగస్వాములను చేసేందుకు దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లాటరీ పూరె్తైన రైతుల ప్లాట్లకు 15 రోజుల్లో పెగ్ మార్కింగ్ చేసి సెంటీమీటరు కూడా తేడా లేకుండా ఆధునిక టెక్నాలజీతో సరిహద్దు రాళ్లు ఏర్పాటుచేసి అప్పగిస్తున్నామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ ఇతర వౌలిక సదుపాయాల పనులు నెల రోజుల్లోగా ప్రారంభమవుతాయన్నారు. ప్లాట్ల విలువ పెంచేందుకు సిఆర్‌డిఎ రైతులకు అండగా ఉంటుందన్నారు. దొండపాడు గ్రామంలో రైతులు కోరిన విధంగా పురాతన పృధ్వీశ్వరాలయం అభివృద్ధికి తగిన స్థలాన్ని లే అవుట్‌లో చేర్చనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ లాటరీ పద్ధతిన ప్లాట్ల కేటాయింపును ప్రారంభించారు. పిచ్చుకలపాలెంలో 498 మంది రైతులు 767.97 ఎకరాల భూమిని భూ సేకరణ కింద ఇచ్చారు. వీరికి 674 రెసిడెన్షియల్ ప్లాట్లు (158.67 ఎకరాలు), 442 కమర్షియల్ ప్లాట్లు (39.66 ఎకరాలు) లాటరీ విధానంలో పంపిణీ చేశారు.

చిత్రం.. పిచ్చుకలపాలెంలో రైతులకు ప్లాట్లు పంపిణీ చేస్తున్న సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీ్ధర్