ఆంధ్రప్రదేశ్‌

పరిశ్రమలకు భూములు ఇవ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 27: మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) అధికారులపై రైతులు తిరగబడ్డారు. బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ నిర్మాణానికి అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు సిద్ధమైన మడ అధికారులు మంగళవారం గ్రామసభల ద్వారా రైతుల ముందుకెళ్లారు. హుస్సేన్‌పాలెం, బుద్ధాలపాలెం, మేకావానిపాలెం, కోన, పోలాటితిప్ప, చిలకలపూడి రెవెన్యూ గ్రామాల పరిధిలో గ్రామసభలు నిర్వహించారు. మడ డెప్యూటీ కలెక్టర్లు గ్రామసభల్లో ప్రభుత్వ ప్యాకేజీపై అవగాహన కల్పించేలోపే రైతులు తిరగబడ్డారు. గోబ్యాక్.. అంటూ నినాదాలు చేశారు. నల్ల రిబ్బన్‌లతో నిరసన తెలిపారు. భూములు ఇవ్వబోమంటూ మూకుమ్మడిగా చేసిన తీర్మానాలను అందజేశారు. ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చేందుకు ఏ ఒక్క రైతు కూడా అంగీకారం తెలపడం లేదని బుద్ధాలపాలెం, కోన గ్రామాల రైతులు గ్రామ పంచాయతీ తీర్మాన పత్రాలను సమర్పించారు. గ్రామసభలకు హాజరైన ప్రతి రైతు ఆక్రోశంతో అధికారులపై దుమ్మెత్తి పోశారు. గత సంవత్సరం ఆగస్టులో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామసభలు జరిగే ప్రాంతంలో 10 నుండి 50 మంది వరకు పోలీసులు మోహరించారు. మడ అధికారులతో వాగ్వివాదానికి దిగిన రైతులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మూడురోజులు జరిగే గ్రామసభల్లో తొలిరోజే రైతుల నుండి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తొలిరోజు గ్రామసభలో అభ్యంతర పత్రాలనే రైతులు తీసుకున్నారు.

చిత్రం.. అరిసేపల్లి గ్రామసభలో మడ అధికారులను నిలదీస్తున్న రైతులు