ఆంధ్రప్రదేశ్‌

‘బి’ కేటగిరి సీట్ల భర్తీకి కౌనె్సలింగ్ నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ వైద్య కళాశాలలు ‘బి’కేటగిరీలో ఖాళీగా ఉన్న సీట్లకోసం రెండవ కౌనె్సలింగ్ నిర్వహించాలని ఏపి ప్రైవేట్ వైద్య కళాశాలల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. కొత్త వైద్య కళాశాలల్లో 142 బి కేటగిరీ సీట్లున్నాయని, కౌనె్సలింగ్‌ను నిర్వహించడానికి ప్రైవేట్ వైద్యకళాశాలలు ముందుకు రావడం లేదని హిమవర్ష తదితర పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. వైద్య కళాశాలల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ బి కేటగిరీలో సీటు పొందిన విద్యార్థులు వేరే కాలేజీలో సీటు వచ్చిందని అడ్మిషన్ రద్దు చేసుకుని వెళితే ఖాళీ అయినట్లని చెప్పారు. హైకోర్టు జోక్యం చేసుకుని ఏ సీటును కూడా ఖాళీగా ఉంచవద్దని ఆదేశించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ మొదటి కౌనె్సలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న బి కేటగిరీ సీట్లను నోటిఫై చేయలేదని తెలిపారు. ఈ కేసును కోర్టు గురువారానికి వాయిదావేస్తూ బి కేటగిరీ కింద ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది.

ఆంధ్ర సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

మధుర స్మృతులు తలచుకుని కన్నీరు సెల్ఫీలు, ఫోటోలు, స్వీట్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్థిక, ప్రణాళిక శాఖ సచివాలయ సిబ్బందికి తెలంగాణకు చెందిన సహచర సిబ్బంది బుధవారం నాడు ఆత్మీయ వీడ్కోలు పలికారు. వెలగపూడిలో అక్టోబర్ 1 నుండి సచివాలయ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభిస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సిబ్బంది హైదరాబాద్ సచివాలయంలో తమ ఛాంబర్లను ఖాళీ చేసి రికార్డులను లారీల్లో పంపించారు. తాము సైతం ప్రత్యేక వాహనాల్లో వెలగపూడికి బయలుదేరారు. ఈ సందర్భంగా సహచర సిబ్బంది వచ్చి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. రెండు మూడు దశాబ్దాలుగా మధుర స్మృతులు, తమ మధ్య ఆత్మీయ సంఘటనలను తలచుకుని ఉద్వేగానికి గురయ్యారు, కొంత మంది సిబ్బంది తమ స్నేహాన్ని గుర్తుచేసి కన్నీరు పర్యంతమయ్యారు. తాము ఎక్కడున్నా తమతో కలిసి పనిచేసిన సిబ్బంది క్షేమానే్న కోరుకుంటామని తెలంగాణ సిబ్బంది వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సెల్ఫీలు, ఫోటోలు దిగారు, ఒకరికొకరు స్వీట్లు తినిపించారు.
నాలుగులారీల్లో రికార్డులు
ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నపుడు రూపొందించిన రికార్డుల జిరాక్స్ కాపీలు, రాష్ట్ర విభజన తర్వాత రూపొందిన రికార్డులను సిబ్బంది లారీల్లో వెలగపూడికి పంపించారు. నాలుగు లారీల్లో ఈ రికార్డులు తరలివెళ్లాయి. ప్రణాళికా శాఖకు సంబంధించిన మరికొన్ని రికార్డులు గురువారం పంపిస్తారు. మొత్తం మీద సచివాలయంలోని అన్ని రికార్డులు ఈ నెలాఖరుకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ కొత్త సచివాలయానికి తరలివెళుతున్న సిబ్బందికి వీడ్కోలు చెబుతున్న తెలంగాణ సిబ్బంది. భావోద్వేగానికి గురైన ఓ మహిళ

ఆంధ్రప్రదేశ్ ద్రోహులు

చంద్రబాబు, వెంకయ్యపై వైకాపా ధ్వజం ప్రత్యేక హోదాపై మాట మార్చారంటూ విమర్శలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 28: ప్రత్యేక హోదాపై మాటమార్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి, వైకాపాశాసనసభాపక్ష ఉపనేత జి శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అవసరాన్ని గుర్తించి మొత్తం తెలుగు జాతి పోరాడుతుంటే, ఉద్యమ స్ఫూర్తిని తుంచివేసే విధంగా వీరు వ్యవహరిస్తున్నారన్నారు. వెంకయ్య, చంద్రబాబు అవిభక్త కవలలని వారు విమర్శించారు. శరీరాలు వేరైనా ఆడే అబద్ధాలు ఒక్కటి ఉంటున్నాయన్నారు. ప్రత్యేక హోదా అనేదాని అవసరమే లేదని వెంకయ్యనాయుడు ప్రకటించడం దారుణమన్నారు. 2014 మే నెలలో వైజ్‌గ్‌లో విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకువస్తామని ప్రకటించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ. 32,461 కోట్లు కేటాయిస్తే, ప్రత్యేక హోదా ఉన్న అన్ని రాష్ట్రాలకు రూ. 91,980 కోట్లు కేటాయించారన్నారు. ఈ వివరాలు ఆర్‌బిఐ ప్రకటించిందన్నారు. వైకాపాను పిల్ల కాంగ్రెస్ అని చౌకబారు తనంతో వెంకయ్య నాయుడు మాట్లాడడం విచారకరమన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకయ్య నోటి వెంట చిల్లర మాటలు మాట్లాడడం ఆశ్చర్యమేస్తుందన్నారు. తాను ఏపి నుంచి పార్లమెంటులో ప్రజాప్రతినిధిగా వ్యవహరించకపోయినా, రాష్ట్రం కోసం పోరాడానని చెప్పుకుంటున్న వెంకయ్య ప్రతి మూడు రోజులకోసారి ఏపికి ఎందుకు పరుగెత్తుకుని వస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి గ్రామంలో సంఘ వ్యతిరేక శక్తులు విజృంభిస్తున్నాయని, కొత్త నరుూంలు పుట్టుకొస్తున్నారని జి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం జరగడం లేదని, అవినీతి అనుసంధానం పెరిగిందన్నారు.

మళ్లీ అల్పపీడన ద్రోణి.. కోస్తాకు వర్ష సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 28: దక్షిణ ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. గడచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా పూసపాటి రేగలో 7 సెంటీమీటర్లు, చీపురుపల్లిలో 6 సెంటీమీటర్లు, విజయనగరం, విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 4 సెం.మీ. వర్షపాతం నమోదైందని తెలిపారు.
‘కృష్ణా జలాలను చెన్నైకి విడుదల చేయాలి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్టల్రు చేసుకున్న అంతరాష్ట్ర ఒప్పందం ప్రకారం చెన్నైకి 15 టిఎంసిల తాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలం నిండినా చెన్నైకి తాగునీరు అందించడంలో జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు. శ్రీశైలం నుండి 70వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు వెళ్తున్నా పోతిరెడ్డిపాడు నుండి 500 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయడం న్యాయం కాదని ఆయన అన్నారు. ఎపి నీటి అవసరాలు తీరుస్తూనే ఎన్‌టిఆర్ హయాంలో కుదిరిన 15 టిఎంసిల నికర జలాలలను చెన్నైకి విడుదల చేయాలని అన్నారు. అంతేగాక, కృష్ణా వరద జలాల నుండి 29 టిఎంసిలను తెలుగు గంగకు విడుదల చేయాల్సి ఉంటుందని చెప్పారు.

మళ్లీ దీక్షకు సిద్ధమా?

నడిరోడ్డుపై ఇద్దరం కూర్చుందాం ముద్రగడకు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ సవాల్

రావులపాలెం, సెప్టెంబర్ 28: కాపులకు బిసి రిజర్వేషన్ల హామీ అమలు కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గతంలో చేసిన ఏడు రోజుల నిరాహార దీక్షపై 13 జిల్లాల కాపు సోదరుల్లో అనుమానాలున్నాయని, వాటిని నివృత్తిచేయడానికి రోడ్డుపై అందరి సమక్షంలో మరోసారి తనతో కలసి దీక్షకు ముద్రగడ సిద్ధమా అని ఎపి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ సవాల్ విసిరారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.
సాధారణంగా ఏడు రోజులు దీక్షచేస్తే సుగర్ లెవెల్స్ బాగా పడిపోతాయని, అయితే ముద్రగడ ఏడు రోజులు దీక్ష చేసినా సుగర్ లెవెల్స్ 126 ఉండటం వెనుక కిటుకేమిటో అర్థం కాలేదన్నారు. ఆయన భార్య షుగర్ లెవెల్స్ మాత్రం 60కి పడిపోయాయన్నారు. తాము కూడా గతంలో దీక్షలు చేశామని, మూడురోజులకే సుగర్ లెవెల్స్ పడిపోతాయన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల 13 జిల్లాల పర్యటనలో భాగంగా తాను కాకినాడకు వచ్చినప్పుడు ముద్రగడను అడిగానన్నారు. దీనికి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద లేఖ రాశారని, కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్థులు తన వద్ద వ్యక్తంచేసిన అనుమానాలనే తాను అడిగానని, దీనికి ముఖ్యమంత్రి ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. తన దీక్షను చంద్రబాబు దొంగ దీక్షగా ఆరోపణలు చేయిస్తున్నారని ముద్రగడ చెబుతున్నారని, అయితే అలాంటి మాటలు తాము అనలేదన్నారు. గతంలో కూడా దీక్ష సమయంలో పోలీసులు తనను, తన భార్యను, కోడలిని పరుష పదజాలంతో దూషించారని ముద్రగడ లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. దీనిపై రిటైర్డు జడ్జితో విచారణ చేయించాలని, ముద్రగడ ఆరోపణలు నిజమని తేలితే తాను చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానన్నారు. కాపుల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబుకు సూచనలివ్వాలని ఆయన ముద్రగడకు హితవు పలికారు.