ఆంధ్రప్రదేశ్‌

లారీలో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనందపురం, సెప్టెంబర్ 29 : ఆనందపురం-తగరపువలస జాతీయ రహదారిపై వెల్లంకి వద్ద గురువారం రాత్రి ప్రమాదవశాత్తు లారీ ఇంజన్ నుండి మంటలు రావడంతో లారీసహా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిళ్లు దగ్ధమయ్యాయి. స్థానికుల పోలీసుల కథనం ప్రకారం చెన్నై నుండి కోల్‌కతాకు 63 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల లోడుతో వెళ్తున్న లారీ వెల్లంకి వద్దకు వచ్చేసరికి ఇంజన్ నుండి మంటలు వ్యాపించడంతో డ్రైవర్ లారీని పక్కకు తీసి ఆపేశాడు. మంటలు క్రమేపీ వ్యాపించడంతో తాళ్లవలస నుంచి అగ్నిమాపక శకటాన్ని రప్పించి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు తీవ్రతరం కావడం, ఫైరింజన్ ఒక్కటే రావడంతో మంటలు అదుపు కాలేదు. పోలీసులు, ఫైరింజన్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనలో 63 బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎవరికీ గాయాలు కాలేదు.

చిత్రం.. ప్రమాదవశాత్తు దగ్ధమత్తున్న లారీ