ఆంధ్రప్రదేశ్‌

200 టిఎంసిలు దాటిన శ్రీశైలం నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 29: శ్రీశైలం జలాశయం నీటిమట్టం 200 టిఎంసిలు దాటింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో గత వారం రోజుల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 883.10 అడుగులుగా నమోదైంది. ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 205.2258 టిఎంసిలుగా ఉంది. ఎగువ నుంచి 58,960 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. మొదటి పవర్ హౌస్ నుంచి 4 యూనిట్లు, రెండో పవర్‌హౌస్‌లో 5 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 61,400 క్యూసెక్కుల నీరు దిగువ సాగర్‌కు విడుదల చేస్తున్నారు.