ఆంధ్రప్రదేశ్‌

దసరాకు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: దసరా పండగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. సికిందరాబాద్-కాకినాడ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ట్రైన్ నెం. 07011 సికిందరాబాద్-కాకినాడ పోర్ట్‌కు అక్టోబర్ 4,11,18,25 తేదీల్లో, అలాగే నవంబర్ ఒకటిన కాకినాడ-సికిందరాబాద్‌కు ఈ రైళ్లు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో కాకినాడ పోర్ట్-సికిందరాబాద్‌కు అక్టోబర్ 5,12,19,26 తేదీల్లో నవంబర్ రెండో తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్ స్టేషన్లలలో అగుతాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
సత్తెనపల్లి-పిడుగురాళ్ల మధ్య రైలు పట్టాలు దెబ్బతినడంతో భువనేశ్వర్-సికిందరాబాద్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వయా విజయవాడ, కాజిపేట్ మీదుగా మళ్లిస్తున్నారు. అదేవిధంగా హౌరా- సికిందరాబద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను విజయాడ, కాజీపేట మీదుగా నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.