ఆంధ్రప్రదేశ్‌

పాపం.. మాణిక్యాలరావు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. దేవాలయాల పర్యవేక్షణ, కమిటీల నియామకాలు, ఇలా ఒకటేమిటి? అన్నీ ఆయన కనుసన్నలలోనే నడవాలి. కానీ, పాపం ఆయన మాట వినే దిక్కులేదు. అది పుష్కరాలయినా, సమీక్ష సమావేశాలయినా, బదిలీలయినా సరే! ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వారి పరిథిలోని ఎమ్మెల్యేలకు ఇచ్చిన విలువ మంత్రికి ఇవ్వరు మరి!! పేరుకే మంత్రి. పెత్తనమంతా ప్రభుత్వానిదే. సొంత పార్టీ వారికి ఒక్క పాలక మండలి సభ్యుడి పదవి కూడా సాధించుకోలేని నిస్సహాయత. ఎర్రబుగ్గకారు, చాంబరు, ప్రొటోకాల్, నౌకర్లు, చాకర్లు. ఇవే ఆయనకు మిగిలిన గౌరవం. ఇదీ మంత్రి మాణిక్యాలరావుదయనీయం!
ఏపి ప్రస్తుత రాజధాని నగరమయిన విజయవాడలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కనకదుర్గ దేవాలయం, తూర్పు గోదావరిలోని ప్రఖ్యాత అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పాలకమండలిని ప్రకటించింది. అందులో ఒక్కరంటే ఒక్క బిజెపి కార్యకర్తకూ చోటు దక్కలేదు. పేరుకు ఆ శాఖకు మంత్రి మాత్రం బిజెపి నుంచి ఎన్నికయిన మాణిక్యాలరావు. కానీ పెత్తనమంతా తెలుగుదేశం ప్రభుత్వానిదే. గతంలో దుర్గగుడి ఉత్సవ కమిటీలో కనీసం ఒకరిద్దరు బిజెపి నేతలకు చోటు లభించింది. కానీ ఈ కమిటీలో ఒక్కరికీ స్థానం కల్పించలేదు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పక్కనే ఉన్న తూర్పు గోదావరిలోని అన్నవరం దేవాలయ కమిటీలోనూ బిజెపి నేతలకు స్థానం కల్పించకపోవడం బట్టి, ఆ శాఖ నిర్వహిస్తున్న మంత్రికి సొంత శాఖలో పట్టు, పలుకుబడి లేదని స్పష్టమవుతోంది.
తాజా నియామకాలపై బిజెపి నేతలు భగ్గుమంటున్నారు. మంత్రికి జరిగిన అవమానం నేపథ్యంలో, పదవికి రాజీనామా చేయడం మంచిదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సొంత మంత్రి సిఫార్సులకే విలువ ఇవ్వకపోతే, ఇక తెదేపాతో ఉన్న సమన్వయ కమిటీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కనకదుర్గ గుడి కమిటీలో తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన వారిని నియమించిన తెదేపా, ఈ ఆలయం, అన్నవరం దేవాలయానికిచెందిన కమిటీల్లో బిజెపి నేతల్లో ఒక్కరికీ స్థానం కల్పించకపోవడం అవమానించడమేనంటున్నారు. రెండురోజుల క్రితమే వెంకయ్యనాయుడును సన్మానించిన వారిలో తెదేపా మంత్రి, ఎమ్మెల్యే ఉన్నారని, సిఎం బాబు కూడా వెంకయ్యను పొగిడిన వైనాన్ని బిజెపి నేతలు గుర్తు చేస్తున్నారు. ‘దీన్ని బట్టి రాష్ట్రంలో పొత్తు పార్టీపరంగా నడుస్తుందో, వ్యక్తిగతంగా నడుస్తుందో అర్థమవుతోంది. నాయుడుగారిని పొ గిడి, మా మంత్రిని అవమానించడం ఏం రాజకీయం? మా పార్టీ మంత్రిని కూడా పక్కకుపెట్టి ఆయన శాఖలో కమిటీలు వేసుకుంటే ఇక సమన్వయం ఏముంది? మరి ఇప్పుడయినా మా అధ్యక్షుడు నోరు విప్పుతారో లేదో చూడాలి. టిడిపిని విమర్శిస్తే బాధపడి, తమనే విమర్శిస్తున్నారని భావించే మా పార్టీ అగ్రనేతలకు ఇది గుణపాఠం కావాలి’ అని బిజెపి సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.