ఆంధ్రప్రదేశ్‌

కంటితుడుపు హామీలెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 29: భారీవర్షాలు, వరదలకు రైతులు నష్టపోతే వారిని ఆదుకోవాల్సిందిపోయి, బంగారంపై రుణాలు ఇవ్వవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్యాంకర్లకు ప్రతిపాదించడం అమానుషమని వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం జిల్లాలో వరదల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను వైసిపి నేతలు సందర్శించి రైతులను పరామర్శించారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరదలకు దెబ్బతిన్న పొలాలు, ఇళ్లను ఏరియల్ సర్వేతో పరిశీలించి ముఖ్యమంత్రి కంటితుడుపు హామీలిచ్చి వెళ్లారని, ఇప్పటివరకు సహాయక చర్యలు చేపట్టలేదన్నారు. మంత్రులెవ్వరూ బాధితులను ఓదార్చిన దాఖలాలు లేవన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు సమంజసమేనన్నారు. అధినేత మెప్పు కోసమే తెలుగుదేశం నాయకులు జగన్‌పై అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. పంటల నష్టంపై ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అంచనాలు వేయలేదన్నారు. కౌలురైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బాధిత రైతాంగానికి ఎకరానికి రూ. 10 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పార్టీ నాయకులు పాల్గొన్నారు.