ఆంధ్రప్రదేశ్‌

తాపేశ్వరం లడ్డూకు గిన్నిస్ బుక్‌లో చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, సెప్టెంబర్ 29: కాజాలకు ప్రసిద్ధిగాంచిన తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. వినాయకచవితి సందర్భంగా తాపేశ్వరం సురుచి ఫుడ్స్ తయారుచేసిన 29,465 కిలోల మహాలడ్డూకు గిన్నిస్ బుక్‌లో స్థానం లభించింది. ఈమేరకు సంస్థ అధినేత పోలిశెట్టి మల్లికార్జునరావు (మల్లిబాబు)కు వర్తమానం అందింది. గురువారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మల్లిబాబు మాట్లాడుతూ గత ఏడాది గుజరాత్‌లోని అంబాలా పట్టణంలో అరసూరి అంబాజీ మాత దేవస్థానం ట్రస్టు తయారుచేసిన 11,115 కిలోల లడ్డూయే ఇంత వరకు గిన్నిస్ రికార్డుగా ఉందని, ప్రస్తుతం సురుచి సంస్థ ఆ రికార్డును అధిగమించిందన్నారు. గాజువాకలోని వినాయకునికి ఈ లడ్డూను సమర్పించామన్నారు. ఇకపై తమ సంస్థ సంస్థ రికార్డు రేసుల్లో పాల్గొనబోదని, మహాలడ్డూల తయారీ కూడా చేపట్టదని ఆయన స్పష్టంచేశారు. ఇంతవరకు ప్రతి సంవత్సరం తాము మహాలడ్డూలను సమర్పిస్తూ వచ్చిన ఖైరతాబాద్ గణేష్ కమిటికి ఇకపై లడ్డూలను సమర్పించబోవడం లేదని మల్లిబాబు పేర్కొన్నారు. తాము సమర్పించే మహాలడ్డూను గణేశుడి చేతిలోనే ఉంచాలనే తమ ఒప్పందాన్ని కమిటీ సభ్యులు ఉల్లంఘించి, ఈ సంవత్సరం గణేష్ మహారాజ్ పాదాల వద్ద లడ్డూను ఉంచినందుకు ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.