ఆంధ్రప్రదేశ్‌

హెచ్చెల్సీకి నేడో, రేపో నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 29: కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర జలాశయం నీటి విడుదలపై ఒంటెద్దు పోకడ అవలంబిస్తోంది. హెచ్‌ఎల్‌సికి నీటి విడుదల చేయడంలో తుంగభద్ర బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. అనంతపురం జిల్లాలోని హెచ్చెల్సీ అధికారులను నీటి విడుదల, నిలిపివేతకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. కాగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిని అవలంబిస్తున్న నేపథ్యంలో నేడో, రేపో టిబి డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయవచ్చని హెచ్చెల్సీ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 16న బెంగళూరులో జరిగిన ఐఎబి సమావేశంలో ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో తుంగభద్ర బోర్డు అధికారులు ఆంధ్ర అధికారులను ఏమాత్రం సంప్రదించలేదు. ఆ తర్వాత 17వ తేదీ నుంచే టిబి డ్యామ్ నుంచి నీటి విడుదల నిలిపివేశారు. బెంగళూరులో తీసుకున్న నిర్ణయం మేరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఈనెల 27 నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే కర్ణాటకలో ఇటీవల వర్షాలు కురుస్తున్నందున అక్కడి రైతులకు నీటి అవసరం లేకుండా పోయింది. దీంతో జలాశయం నుంచి నీటిని విడుదల చేయడం నిలిపివేశారు. అయితే ఈ విషయాన్ని హెచ్చెల్సీ అధికారులకు తెలియజేయలేదు. సుమారు 1200 నుంచి 1500 క్యూసెక్కుల నీటిని వదలాల్సి ఉంది.
అలాగే ఎల్‌ఎల్‌సికి 700 క్యూసెక్కులు వదలాలి. అక్టోబర్ 12 నుంచి 21 వరకు తిరిగి నీటి విడుదల ఆపేస్తారు. తర్వాత కూడా ప్రతి 10-15 రోజులకోమారు నీటిని నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈనెలలో హెచ్చెల్సీకి రావాల్సిన నీటి వాటా విడుదల చేయక పోవడంతో అధికారుల్లో ఆందోళన చోటుచేసుకుంది. కాగా జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో తాగునీటి సమస్య తలెత్తకుండా తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలయ్యే నీటిని వాడుకోవాల్సి ఉంది. ఏటా టిబి జలాశయం నుంచి నీటి లభ్యతను బట్టి 32.50 టిఎంసిలు హక్కుగా దక్కాల్సి ఉంది. అందులో 22 నుంచి 23 టిఎంసిలు మాత్రమే దక్కుతోంది. గత ఏడాది 17 టిఎంసిలు మాత్రమే విడుదల చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తంగా 10 టిఎంసిల లోపే నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో సకాలంలో నీటిని విడుదల చేయకపోతే నష్టపోతామేమోనన్న ఆందోళన ఇటు అధికారులు, అటు రైతుల్లో నెలకొంది. ఇక ఆన్ అండ్ ఆఫ్ విధానంలో కర్ణాటక ప్రాంతానికి, ఆంధ్ర (హెచ్చెల్సీ, ఎల్‌ఎల్‌సి)కి ఏకకాలంలో నీటిని వదలేలా టిబి బోర్డు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నేడో, రేపో హెచ్చెల్సీ, ఎల్‌ఎల్‌సికి నీరు విడుదల అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు హెచ్చెల్సీ రైతులు ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది కూడా ఆయకట్టు బీడు పడింది. అయితే టిబి డ్యామ్‌లో నీటి లభ్యత తగ్గడంతో ఈఏడాది కూడా ఆయకట్టుకు నీరు దక్కే సూచనలు కనిపించడం లేదు.