ఆంధ్రప్రదేశ్‌

ప.గో. తరహాలో పౌర సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 29: పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వినూత్నరీతిలో ప్రవేశపెట్టిన పౌర సేవలు విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండోరోజైన గురువారం ముఖ్యమంత్రి వివిధ జిల్లాల వారీ ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ డా.కాటమనేని భాస్కర్ పౌర సేవలపై ప్రత్యేకంగా రూపొందించిన యాప్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పంచాయతీల్లో ఇళ్లపన్ను, పంపు పన్ను వసూలుతోపాటు ప్రజలకు ఆదాయ, నివాస, కుల, జనన మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు వివిధ రకాల పౌర సేవలను ఆన్‌లైన్ ద్వారా ప్రజలు ఇంటి వద్ద నుండే నేరుగా పొందే వెసులుబాటును కల్పించామని, దీనివల్ల జిల్లాలో మంచి ఫలితాలు లభిస్తున్నాయని డా.్భస్కర్ వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ మీ సేవా కేంద్రానికి వెళ్లకుండానే ఆధార్‌ను ఆధారం చేసుకుని పౌరులకు కావలసిన వివిధ ధ్రువపత్రాలను పొందే విధానం బాగుందని, దీన్ని అన్ని జిల్లాల్లో నెల రోజుల్లో అమల్లోకి తీసుకురావాలని కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ వివరిస్తూ 2016 ఖరీఫ్‌లో పంట ఉత్పాదకత ఆశాజనకంగా ఉందని గతంలో కన్నా 5 నుండి 6శాతం అధిక దిగుబడి లభిస్తోందన్నారు. 2016 ఖరీఫ్ పంట కోతలు ప్రారంభమయ్యాయని అక్టోబర్ మూడవ వారం నాటికి పూర్తవుతాయని చెప్పారు. రబీ అనంతరం 3 లక్షల ఎకరాల్లో మూడవ పంటగా మినుములు, పెసర పంటకు వెళుతున్నామని, అవసరమైన విత్తనాలు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. లాభసాటిగా లేని పొగాకు పంటకు బదులుగా 12వేల ఎకరాల్లో మొక్కజొన్న, టిష్యూ తదితర వాటివైపు రైతులను చైతన్య పరుస్తున్నామన్నారు. రెండేళ్లలో ఎరువులు, పురుగుమందులు వినియోగం శాతాన్ని గణనీయంగా తగ్గించగలిగామని, దీంతోపాటు యూరియా వినియోగాన్ని తగ్గించామన్నారు. బియ్యపుతిప్పలో మెరైన్ ఫిషింగ్ హార్బన్‌కు సంబంధించి అనుమతులు ఇప్పుడే లభించాయన్నారు.
హామీలను కార్యాచరణలో చూపితే ఘన సత్కారం
లక్ష్యసాధనలో జిల్లా కలెక్టర్లు ఇస్తున్న హామీలను ఖచ్చితంగా కార్యాచరణలో చూపగలిగితే ఇదే సమావేశాల్లో ఘనంగా సత్కరిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి కలెక్టర్ కూడా తన ఆలోచనను ఏవిధంగా కార్యాచరణలోకి తీసుకువస్తుందీ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. కడప జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ ‘గత ఏడాది 8.4 వృద్ధిరేటు వుండగా ఈ ఏడాది 23 శాతం సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పుడు సిఎం ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయకుమార్ వ్యవసాయ రంగంలో సాధిస్తున్న గణనీయమైన ప్రగతిని వివరించారు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో సకాలంలో వేరుశనగ పంటను రక్షించటం ద్వారా రూ.250 కోట్లు ఆదాయం రాబోతున్నదని అన్నారు. రాయలసీమ జిల్లాల్లో నవధాన్యం పంటలపై దృష్టి పెట్టాలంటూ ఆయన చేసిన సూచనను సిఎం అభినందించారు. శుక్రవారంనాడు పదవీ విరమణ చేస్తున్న విజయకుమార్‌ను చంద్రబాబు అభినందిస్తూ అదే సమావేశంలోనే ఆయనను వ్యవసాయ శాఖ రాష్ట్ర సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.