ఆంధ్రప్రదేశ్‌

దేశభక్తి, దైవభక్తి ప్రతి ఒక్కరికీ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 29: దేశభక్తి, దైవభక్తి ప్రతి ఒక్కరికీ అవసరమని, మనం చేసే మంచి పనికి భగవంతుడు తోడుగా నిలుస్తాడని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. ఈ రెండు లక్షణాలను ప్రజల్లో పెంపొందించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ దేశవ్యాప్తంగా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గత నెల 4న స్థానిక రామలింగేశ్వరపేటలో ఆర్‌ఎస్‌ఎస్ నూతన భవన ప్రారంభమయినా, స్వామి అప్పట్లో చాతుర్మాస దీక్షలో ఉండడం వల్ల భవనాన్ని సందర్శించలేకపోయారు. స్వామీజీ కార్యాలయ ప్రాంగణంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలనుద్దేశించి అనుగ్రహభాషణ చేసారు. మహారాష్టల్రోని నాగపూర్‌లో స్థాపితమైన ఆర్‌ఎస్‌ఎస్ నేడు శాఖోపశాఖలుగా దేశవ్యాప్తంగా విస్తరించిందని, ఈ నూతన భవనం ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన కేంద్రంగా విరాజిల్లాలంటూ ఆకాంక్షించారు. కంచి కామకోటి ఉత్తరాధికారి శ్రీ విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ మనిషికి బుద్ధి, శరీరం, ద్రవ్యం, ద్రుఢమైన శరీరం, దీర్ఘాయుష్షు అవసరమని, వీటన్నింటితో త్రికరణ శుద్ధిగా పనిచేయాల్సి వుంటుందన్నారు. వేదాల్లో చెప్పిన నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం ఈ పంచ భూతాలు కాలుష్యం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ప్రపంచంలోని భారతదేశ సంస్కృతి, జీవన విధానం కొనియాడదగినదన్నారు. శంకరాచార్యులు బోధించిన విధంగా విద్య, విత్తం, శక్తి, కీర్తిప్రతిష్ఠలు, పుణ్యం ఎంతో అవసరమంటూ ఆ దిశగా ఆర్‌ఎస్‌ఎస్ ముందుకు సాగుతున్నదంటూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసరాజు, జాతీయ ప్రచారక ప్రముఖ్ మన్మోహన్ వైద్య, స్థానిక నేతలు పాల్గొన్నారు.

చిత్రం.. భక్తులకు అభిభాషణ చేస్తున్న విజయేంద్ర సరస్వతి