ఆంధ్రప్రదేశ్‌

ఆధార్ అనుసంధానంపై ఆరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 29: పశ్చిమగోదావరి జిల్లాలో ఆధార్ అనుసంధానంతో ఆన్‌లైన్ ద్వారా పెన్షన్లు, ఇ-పాస్ ద్వారా రేషన్, ఎరువుల సరఫరా ప్రక్రియను అమెరికాకు చెందిన బిల్‌గేట్స్ మిలిండా ఫౌండేషన్ సభ్యులు గురువారం పరిశీలించారు. తొమ్మిది మంది సభ్యుల బృందం దెందులూరు మండలం కొవ్వలి గ్రామం సందర్శించింది. అక్కడ రైతులు, సామాజిక పెన్షన్లు పొందే లబ్ధిదారులు, తెల్ల రేషన్ కార్డుదారులతో బృందం సభ్యులు స్వయంగా మాట్లాడారు. గ్రామంలోని మొటపర్తి భవనంలో డిఆర్‌డిఏ ద్వారా నిర్వహించే డిజిటల్ లిటరసీ, డ్వామా చేపట్టే ఎన్‌ఆర్‌జిఎస్ పనులపై అధికారులిచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను బృందం సభ్యులు తిలకించారు. ఇంటర్నెట్ అక్షరాస్యత కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా పశ్చిమగోదావరిలో అమలుచేస్తున్నామని ఈసందర్భంగా డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాస్ వారికి వివరించారు. ఆండ్రాయిడ్ ఫోన్, యాప్ ద్వారా ప్రతీ ఎస్‌హెచ్‌జి గ్రూపునకు ఫోన్లు ఇచ్చామని వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్‌హెచ్‌జి గ్రూపులు, రైతులు, పెన్షన్‌దారులు, ఇతర ప్రజల్లో ఎంతమంది వద్ద స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయని, ఎంత మందికి స్మార్ట్ ఫోన్ ద్వారా బ్యాంకు లావాదేవీలు, అకౌంట్లు నిర్వహించడం తెలుసని బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఒక్కరికీ ఆధార్, బ్యాంకు అక్కౌంట్, గ్యాస్ కనెక్షన్, ఎటిఎంలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రేషన్‌కు సంబంధించి మీకు నగదు కావాలా, ఆహార ధాన్యాలు కావాలా అని ప్రశ్నించగా ప్రతీ ఒక్కరూ ఆహార ధాన్యాలే కావాలని బదులిచ్చారు. జిల్లాలో 99.95 శాతం ఆధార్ సీడింగ్ అయ్యిందని కేవలం 5 శాతం మాత్రమే కాలేదని వారు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడం వలన ఆ 5 శాతం కూడా జరగలేదని డ్వామా పిడి వెంకటరమణ ప్రతినిధులకు వివరించారు. ఆంధ్రాబ్యాంకును సందర్శించి బ్యాంకులో జరుగుతున్న సబ్సిడీ లావాదేవీలను బృందం పరిశీలించింది. కొవ్వలి వ్యవసాయ శాఖ ద్వారా విశాల సహకార పరపతి సంఘంలో ఏర్పాటుచేసిన ఎరువుల పంపిణీ ఆన్‌లైన్ ద్వారా ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నదీ సమాచారాన్ని బృందం సభ్యులు జెడి సాయి లక్ష్మీశ్వరిని అడిగి తెలుసుకున్నారు. ఇ-పాస్ ద్వారా తెల్లకార్డుల వారికి రేషన్ పంపిణీని కూడా పరిశీలించింది. జిల్లా పౌర సరఫరాల అధికారి శివశంకరరెడ్డి మాట్లాడుతూ ప్రతీ కార్డుదారుకూ ఒక రూపాయికే కిలో బియ్యం ఇవ్వడం జరుగుతుందని, బియ్యం కేజీ ఖరీదు 33 రూపాయలు ఉన్నందు వలన మిగతా 32 రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ భరిస్తుందని వివరించారు. ఈబృందంలో పవన్ భక్షి, డేనియల్ మైఖేల్ రాడ్ క్లిప్, డేవిడ్ జాసాన్ పార్కర్, మిస్ శారా ఇ హ్యాండ్రిక్స్, లిజ్ కిల్సన్, జర్మీ ప్లేస్ షెప్రో, కింబర్లీ లింగ్ లీ, నిక్ యాగన్, సునీల్ రామన్ ఉన్నారు. వారి వెంట జెసి-2 ఎంహెచ్ షరీఫ్, ఐసిడిఎస్ పిడి చంద్రశేఖర్, పశుసంవర్ధక శాఖ జెడి జ్ఞానేశ్వరరావు, ఫిషరీస్ డిడి జాకబ్ బాషా తదితరులు ఉన్నారు.

చిత్రం.. ఆన్‌లైన్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ విధానం తిలకిస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులు