ఆంధ్రప్రదేశ్‌

నరకం చూపించిన అండమాన్ ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 29: అండమాన్‌లోని పోర్టుబ్లెయిర్‌కు బయలుదేరిన నౌక ప్రయాణికులకు నరకం చూపించింది. సాంకేతిక లోపంలో నిలిచిపోయిన నౌకలో దాదాపు రెండున్నర రోజుల అష్టకష్టాలు పడ్డారు. భోజనం, నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. విశాఖలోని జెట్టీకి బుధవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల సమయానికి నౌక చేరుకున్నప్పటికీ అధికారులు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా 14 గంటల పాటు నిరీక్షించాల్సి ఉంది. షిప్పింగ్ కార్పొరేషన్‌కు చెందిన ఎం.వి.హర్షవర్దన విశాఖ నుంచి మంగళవారం పోర్టుబ్లెయిర్‌కు బయలుదేరింది. దాదాపు ఆరు గంటల ప్రయాణం తరువాత నౌకలో ఇంజన్ జనరేటర్ పని చేయడం నిలిచిపోవడం తెలిసిందే. దీంతో నౌకా సిబ్బంది మరమ్మతు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో నౌకను తిరిగి విశాఖకు గురువారం తీసుకువచ్చారు. ఈ నౌకకు మరమ్మతు చేసే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాకపోవడంతో ప్రయాణికులకు టికెట్ చార్జీలను తిరిగి చెల్లించి పంపేందుకు నిర్ణయించారు. నౌకలో దాదాపు 506 మంది ప్రయాణికులు ఉన్నారు. నీరు, ఆహారం లేక ఇక్కట్లు పడ్డారు. టాయిలెట్లలో రెండు అడుగల మేర నీరు నిలవడంతో వాసన భరించ లేక డెక్‌పై పొడుకోవాల్సి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. ఆహారం అధిక ధరలకు కొనుక్కోవాల్సి వచ్చిందని, ఉడికీఉడకని బిర్యానీ, నీళ్ల పాలను కొనుక్కున్నామని ఆరోపించారు. బయట వర్షం పడుతున్నప్పటికీ లోపల ఉక్క పోతతో ఇబ్బంది పడ్డారు. నౌకా సిబ్బంది పట్టించుకోలేదని, గురువారం సాయంత్రం ప్రయాణికులు అంతా కెప్టెన్‌ను చుట్టుముట్టి ప్రశ్నించాకే విశాఖకు తిరిగి తీసుకువెళ్లేందుకు నిర్ణయించారని తెలిపారు. నౌక విశాఖకు చేరుకున్నప్పటికీ గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. నౌక మరమ్మతుకు సమయం పట్టేలా ఉందని భావించి ఎట్టకేలకు ప్రయాణికులను తిరిగి పంపేసేందుకు నిర్ణయించారు. ఈ దిశలో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురం, పలాస, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి సోమవారమే వచ్చామని, తెచ్చుకున్న డబ్బులన్నీ ఈ మూడు రోజుల్లో అయిపోయాయని, తమను ప్రత్యేక నౌకలో అండమాన్‌కు తీసుకువెళ్లాల్సిందేని గాంధీ డాక్ గేట్ వద్ద ఆందోళనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తిరిగి వెళ్లేందుకు తమ వద్ద డబ్బులు లేవని వాపోయారు. మూడు రోజుల సమయం ఇక్కడే గడిచిపోయిందని, తిరిగి ఎప్పటికి అండమాన్ వెళ్లగలమోనని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారు, పిల్లలు, మహిళలు ఆహారం లేక, తగిన సమచారం లేక నానా అగచాట్లు పడ్డారు. విజయనగరం జిల్లా ఎల్‌కోట మండలం భీమాళికి చెందిన మణికంఠ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో అధికారుల కాళ్లు పట్టుకుని అతని తల్లి వరలక్ష్మి బతిమిలాడింది. దీంతో అతన్ని ముందుగా బయటకు వచ్చేందుకు అనుమతించారు. లగేజీ, టిక్కెట్టు డబ్బు వాపసు వ్యవహారం తేలకపోవడంతో సాయంత్రం వరకూ అక్కడే ఉండాల్సి వచ్చింది. కొంతమంది తమ బంధువులు చనిపోవడంతో చూసేందుకు వచ్చిన వారు, అమ్మమ్మ దగ్గరికి వెళ్లేవారు, బంధువు పెళ్లికి వచ్చి తిరిగి వెళ్తున్న వారు, ఆరోగ్య పరీక్షలకు వచ్చి వెళ్తున్న వారు ఉన్నారు. తమ వారి క్షేమ గురించి తెలుసుకునేందుకు వచ్చిన వారితో పోర్టు ఏరియా నిండిపోయింది. సాయంత్రం నాలుగు గంటలు దాటాక చెల్లింపులు ప్రారంభించారు.

చిత్రం.. విశాఖ జెట్టీకి చేరిన ఎంవి హర్షవర్దన ప్రయాణికుల నౌక