ఆంధ్రప్రదేశ్‌

మేనేజర్ల వ్యవస్థకు హైకోర్టు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), సెప్టెంబర్ 30: ఉమ్మడి రాష్ట్రాల్లోని వివిధ జిల్లా స్థాయి కోర్టుల్లో పరిపాలన విభాగంలో సహకారం అందించేందుకు మూడేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా నియమించిన 28 మంది మేనేజర్లకు ఒకేరోజు హైకోర్టు ఉద్వాసన పలికింది. ప్రతి జిల్లా కోర్టులో పరిపాలనాధికారులు (ఎఒ) ఉండగా వారికి సమాంతరంగా మేనేజర్ల విధులు ఉండటంతో పాటు యేటా రెండున్నర కోట్ల రూపాయల వ్యయం ఉమ్మడి రాష్ట్రాల న్యాయశాఖలకు భారంగా మారడం ఈ నిర్ణయానికి కారణంగా తెలిసింది.
మూడేళ్ల క్రితం రాష్ట్ర హైకోర్టులో 5 పోస్టులు, ప్రతి జిల్లా కోర్టులో ఒక్కొక్క పోస్టు చొప్పున 28 మంది మేనేజర్లను కాంట్రాక్టు పద్ధతిపై నియమించారు. వీరికి ఒక్కొక్కరికీ జీతభత్యాల కింద 70 వేల రూపాయల వరకు అందుతోంది. సాధారణ పరిపాలన అంశంలో జిల్లా న్యాయమూర్తులకు వీరు సహకారం అందిస్తారు. న్యాయశాఖలోని ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదుల వంటి అంశాల్లో న్యాయమూర్తులకు అదనపు సమాచారం వీరు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులు రాకముందు ఈ తరహా పనులన్నింటినీ ఆయా కోర్టుల్లోని పరిపాలనాధికారులు పూర్తిచేసేవారు. మేనేజర్ పోస్టులు వచ్చాక పరిపాలనాధికారులకు, మేనేజర్లకు కొన్ని కోర్టుల్లో సమన్వయం కుదరక విధుల నిర్వహణలో విభేదాలువచ్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. తాము న్యాయశాఖ నుండి వచ్చిన సీనియర్ పరిపాలనాధికారులమంటూ ఎఒలు చెప్పుకుంటుండగా, తమను ప్రత్యేకంగా నియమించారంటూ మేనేజర్లు సమాధానమిచ్చేవారు. ఈ అంశంపై కూడా ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టుకు ఫిర్యాదులు అందడంతో ఏకంగా మేనేజర్ల వ్యవస్థనే రద్దుచేస్తూ శుక్రవారం హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. ఇలా ఉండగా మేనేజర్లుగా తాము ఎంతో హుందాగా వ్యవహరిస్తూ చక్కగా పనిచేస్తున్నప్పటికీ ఆకస్మికంగా అందరినీ తొలగించడంపై పలువురు మేనేజర్లు ఆవేదన వ్యక్తం చేశారు.