ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి క్యూకట్టిన విద్యా సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు రచించిన ప్రభుత్వం విద్యారంగంలో కూడా అగ్రపీఠాన నిలిపేందుకు చర్యలు చేపట్టింది. రాజధానిలో నివసించే ప్రజలను దృష్టిలో ఉంచుకుని 160కి పైగా ప్రాధమిక పాఠశాలలు, వందకు పైగా ఉన్నత పాఠశాలలు, 27 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి తోడు సాంకేతిక విద్యా కేంద్రాలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వృత్తి విద్యా కాలేజీలు, విశ్వవిద్యాలయాలు రెండు నుండి మూడు ఏర్పాటు చేస్తారు. పది జనరల్ ఆస్పత్రులు నిర్మిస్తారు. 25 నుండి 30 పాలిక్లినిక్‌లను ఏర్పాటు చేస్తారు. మరో పక్క రాజధానిలో నివసించే ప్రజలతో పాటు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 25 నుండి 30 అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రులకు అనుమతి ఇస్తారు.
24 నుండి 30 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేస్తారు. హెల్త్ సెంటర్లు గానీ క్లినిక్‌లు కాని మరో వంద ఏర్పాటు చేస్తారు. రాజధాని నిర్మాణం సందర్భంగా భూములు ఇచ్చిన రైతులు , ఆ భూములపై ఆధారపడే రైతు కూలీలు, ఇతర బలహీనవర్గాల వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారికి వార్షిక చెల్లింపులు చేస్తోంది. 24,100 మంది రైతులకు ప్రభుత్వం పది సంవత్సరాల పాటు కౌలు చెల్లిస్తుంది. అలాగే 19,055 కుటుంబాలకు పదేళ్లపాటు పెన్షన్ కూడా చెల్లించబోతోంది. సామాజికాభివృద్ధికి ప్రభుత్వం మొత్తంగా 308 కోట్లు ఖర్చు చేయనుంది. అదే స్థాయిలో ప్రభుత్వం మహానగర నిర్మాణంలో వౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతోంది.
నాగార్జున వర్శిటీ అక్రమాలపై త్రిసభ్య కమిటీ
నాగార్జున వర్శిటీలో పరీక్షలు, అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఐఎఎస్ అధికారిగా పనిచేసి రిటైరైన డాక్టర్ చక్రపాణి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ విజయలక్ష్మి, ఉన్నత విద్యామండలి డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి సభ్యులుగా ఉంటారు.