ఆంధ్రప్రదేశ్‌

2011 మెయన్స్‌లో సిలబస్‌లో లేని ప్రశ్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్ పరీక్షలో ఐదో పేపర్‌లో ఇచ్చిన గణిత ప్రశ్నలు సిలబస్‌లో లేనివేనని ఫలితంగా 30 మార్కులను విద్యార్ధులు నష్టపోవల్సి వచ్చిందని డివైఎఫ్‌ఐ కార్యదర్శి ఎం సూర్యారావు తెలిపారు. సిలబస్‌కు సంబంధం లేని మూడు ప్రశ్నలు తొలగించడం ద్వారా అభ్యర్ధులు మధ్య సమతుల్యతను పాటించాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఐదో పేపర్ లెక్కలులో ఉన్న ప్రశ్న 2 బి, 3 ఎ, 10 ప్రశ్నలు సంబంధం లేనివి వచ్చాయని దీని వల్ల నాన్ మేథ్స్ అభ్యర్ధులు పేపర్ చూడగానే తీవ్ర మనోవేదనకు గురయ్యారని పేర్కొన్నారు. మొత్తం 750 మార్కులకు గానూ జరిగే పరీక్షలో 150 మార్కులు మాథ్స్ నుండి కోల్పోతామనే ఆందోళన చెందారని అన్నారు.దీని ప్రభావం మిగిలిన ప్రశ్నలపై కూడా పడిందని వివరించారు. ఐదు పేపర్లలో 150కి 150 మార్కులు వచ్చే అవకాశం ఉన్న పేపర్ అయినా లోపం జరగడంతో మానసికంగా అభ్యర్ధులు ఆందోళనకు గురయ్యారని చెప్పారు. వెంటనే తప్పుడు ప్రశ్నలను తొలగించి అందరికీ సమానంగా అవకాశలు వచ్చేలా బోర్డు నిర్ణయించాలని డిమాండ్ చేశారు.