ఆంధ్రప్రదేశ్‌

ధవళేశ్వరం వద్ద వరద తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 30: అఖండ గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతంలోని భద్రాచలం వద్ద గత 24 గంటలుగా అతి నెమ్మదిగా తగ్గుదల కన్పించడంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి వద్ద నిలకడగా ఉన్న వరద శుక్రవారం రాత్రి నుంచి తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు బ్యారేజీకి ఉన్న అన్ని గేట్లు ఎత్తివేసి, 5.40 లక్షల క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదలచేశారు. రాత్రికల్లా గేట్లను నిర్వహణలోవుంచి 4.24 లక్షల క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు 30.6 అడుగుల నీటి మట్టం నమోదు కాగా రాత్రి సమయానికి 30.5 అడుగులకు స్వల్ప తగ్గుదల కన్పించింది. అయితే డెల్టాల్లో వరికి ప్రస్తుత దశలో నీటి అవసరం పెరిగింది. ఈ క్రమంలో ధవళేశ్వరం బ్యారేజి నుండి డెల్టాలకు సాగునీటి జలాలను అధికంగా సరఫరా చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 3300 క్యూసెక్కుల నుంచి 4100 క్యూసెక్కులకు పెంచారు. మధ్య డెల్టాకు 1500 క్యూసెక్కుల నుంచి 1800 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 1000 నుంచి 1500 క్యూసెక్కులకు నీటి సరఫరా పెంచారు. ధవళేశ్వరం ఆర్మ్‌లోని గేట్లను 1 మీటరు, ర్యాలి, మద్దూరు ఆర్మ్‌ల్లో గేట్లను 1.5 మీటర్లు, విజ్జేశ్వరం ఆర్మ్‌లో 1 మీటరు మేరకు ఎత్తి,వేశారు.
శ్రీశైలానికి తగ్గిన ఇన్‌ఫ్లో
శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నీటి రాక గణనీయంగా తగ్గిపోయింది. శుక్రవారం సాయత్రం 6 గంటల సమయానికి జలాశయం నీటిమట్టం 882.80 అడుగులకు చేరుకుంది.