ఆంధ్రప్రదేశ్‌

వర్షాలకు ఆంధ్రాలో భారీ నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బి రోడ్లు అధికంగా దెబ్బతిన్నాయి. గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల్లో రోడ్లు పెద్ద ఎత్తున ధ్వంసం అయ్యాయి. చాలా చోట్ల వరదలకు రోడ్లు కొట్టుకుపోయాయి. రోడ్లు భవనాల శాఖ తాజా పరిశీలన మేరకు 10 జిల్లాల్లో 2,200 కిలోమీటర్లు మేర రోడ్లు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. ఈ రోడ్లను శాశ్వత ప్రాతిపదికపై బాగు చేసేందుకు 499 కోట్లు అవసరమని ఆర్ అండ్ బి అంచనా వేసింది. తక్షణ మరమ్మతులకు 70.78 కోట్లు అవసరమని తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి రోడ్లు భవనాల శాఖ , పంచాయతీరాజ్ శాఖలు నివేదికలు అందజేశాయి. ఈ నివేదిక ప్రాతిపదికగా రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సాయం కోరుతూ మరో నివేదిక పంపనున్నట్టు తెలిసింది.
జిల్లాల వారీగా అందిన సమాచారం ప్రకారం శ్రీకాకుళంలో 65 కిలోమీటర్లు, విజయనగరంలో 117.09 కిలోమీటర్లు, విశాఖలో 268.08 కి.మీ, తూర్పుగోదావరిలో 247 కి.మీ, పశ్చిమగోదావరిలో 664.66 కి.మీ, కృష్ణా జిల్లాలో 13 కి.మీ, గుంటూరు జిల్లాలో 406.45 కి.మీ, ఒంగోలులో 38.50 కి.మీ, కర్నూలులో 376.31 కి.మీ, కడపలో 4.50 కిలోమీటర్ల రహదారులు ధ్వంసం అయ్యాయి.