ఆంధ్రప్రదేశ్‌

కృష్ణపట్నం ఓడరేవులో పటిష్ఠ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 30: భారత సైన్యం పిఓకెలోని పాకిస్తాన్ మిలిటెంట్ల స్థావరాలపై మెరుపుదాడులు చేసి 38మంది ఉగ్రవాదులను హతమార్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని మెట్రో నగరాలతోపాటు ముఖ్య ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవులో ఉన్నతాధికారులు మూడంచెల పటిష్ట భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈమేరకు శుక్రవారం నుంచి దాదాపు 15రోజుల పాటు ఓడరేవులో కీలకమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ విషయాన్ని కృష్ణపట్నం పోర్టు సీనియర్ జనరల్ మేనేజర్ టి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అన్ని ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలు, తీరప్రాంత గస్తీని ముమ్మరం చేయడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తుంటారని ప్రకటించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్స్, కస్టమ్స్, మెరైన్ పోలీస్, స్థానిక పోలీస్ యంత్రాంగంతోపాటు పోర్టు సెక్యూరిటీ బృందం ప్రధాన పాత్ర నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఓడరేవు సందర్శనను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. వివిధ పనులపై ఓడరేవుకు వచ్చేవారిని కార్మికులు, ఉద్యోగులు స్థానికులు ఎవరైనా గుర్తింపుకార్డులు తమ వెంట తెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఓడరేవు పరిసర ప్రాంతాల ప్రజలు ఓడరేవు సిబ్బందికి సహకరించాలని పోర్ట్ సెక్యూరిటీ ఎజిఎం మనోహర్‌బాబు కోరారు.