ఆంధ్రప్రదేశ్‌

పట్టిసీమలో మళ్లీ పనిచేస్తున్న మోటార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, సెప్టెంబర్ 30: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని మోటార్లను ఆన్‌చేసి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తరలించే ప్రక్రియను శుక్రవారం నుండి తిరిగి ప్రారంభించారు. సెప్టెంబర్ 20వ తేదీ వరకు 17 మోటార్లు ఆన్‌చేసి రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీటిని తరలించేవారు. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి పూర్తిస్థాయిలో నీరు చేరడంతో 21వ తేదీ ఉదయం నుండి మోటార్లను నిలిపివేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా జిల్లా అధికారుల సూచనల మేరకు శుక్రవారం ఉదయం ఎనిమిది మోటార్లు ఆన్ చేసి 2832 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నట్టు కుడి కాల్వ ఎఇ శ్రీనివాస యాదవ్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు ఆగిపోవడం, కృష్ణా డెల్టాకు నీటి అవసరాలు వారం రోజుల్లో మొదలయ్యే అవకాశం ఉండడంతో మోటార్లు ఆన్ చేసినట్టు సమాచారం. పట్టిసీమ నుండి తరలించే నీటినే తాగునీటి అవసరాలకు కూడా వాడుకునేందుకు మోటార్లు ఆన్ చేసినట్టు తెలిసింది. శుక్రవారం నుండి తరలిస్తున్న గోదావరి నీరు అయిదు రోజులకు కాని కృష్ణాడెల్టాకు చేరదు. అప్పటికి కృష్ణా డెల్టాకు సాగునీటి అవసరాలు మొదలయ్యే అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్తతో మోటార్లు ఆన్ చేసినట్టు అధికారులు తెలిపారు.