ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 30: భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విశాఖలో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖలోని తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. నౌకాదళ స్థావరం వద్ద నిఘాను, పహారాను ముమ్మరం చేశారు. అలాగే సముద్ర మార్గాల గుండా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉండవచ్చన్న అనుమానంతో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో పహారా కాస్తున్నారు. తూర్పు నౌకాదళ వ్యూహాత్మక విమానాశ్రయమైన ఐఎన్‌ఎస్ డేగాలో సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి. అలాగే విశాఖ ఎయిర్‌పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన స్టీల్ ప్లాంట్, హెచ్‌పిసిఎల్, ఎన్‌టిపిసి, నేవల్ డాక్‌యార్డుల దగ్గర భద్రతను ముమ్మరం చేశారు. పాక్ సానుభూతిపరులెవరైనా అల్లర్లకు దిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో హై అలర్ట్ ప్రకటించినట్టు అధికారులు వెల్లడించారు.
గుర్తింపు కార్డులుంటేనే
కంటోనె్మంట్‌లోకి అనుమతి
హైదరాబాద్: సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ఆర్మీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాక్ ఏదో ఒక దుస్సాహసానికి ఒడిగట్టే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో ఆర్మీ అధికారులు, కంటోనె్మంట్ ఇతర ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అందాయి. దీంతో హైదరాబాద్‌లోను హై అలర్ట్ ప్రకటించారు. ఆర్మీ పాస్‌లు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పాస్‌లు లేని వాహనాలు వేరే మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. సికింద్రాబాద్, కంటోనె్మంట్, గోల్కొండ ప్రాంతాల్లో ఇప్పటికే చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రాత్రిపూట ఎవరినీ అనుమతించడం లేదు.
పగలు కూడా గుర్తింపు పత్రాలు చూపిన తరువాతే అనుమతిస్తున్నారు. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, పహాడిషరీఫ్ పరిధిలోని డిఆర్‌డిఎల్, డిఆర్‌డిఓ, మిధాని, ఆర్‌సిఐ, బిడిఎల్ వంటి రక్షణ శాఖకు సంబంధించిన సంస్థలున్నాయి. ఇవన్నీ చాలా కీలకమైనవి కావడంతో గుర్తు తెలియని వ్యక్తులను అసలు ఆ ప్రాంతాలలోకి అనుమతించవద్దని నిఘా వర్గాలు హెచ్చరించాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన సూచనలు కూడా ఇచ్చారు.
ఈ సంస్థల మీద దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. రక్షణ సంస్థల మీద దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ వర్గాలు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక చెక్‌పోస్టులతో పాటు బలగాలను రంగంలోకి దింపారు. రక్షణ శాఖకు సంబంధించిన సంస్థలున్న రాష్ట్రాలన్నింటి ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే మాట్లాడారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ఫోన్ చేశారు. కంటోనె్మంట్, ఏఓసి గేట్ ప్రాంతాలతో పాటు గోల్కొండ, మెహిదీపట్నం, నార్సింగ్, కంచన్‌బాగ్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.