ఆంధ్రప్రదేశ్‌

తీరంలో స్వచ్ఛ్భారత్ సాగర్ అభియాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 1: సముద్ర తీరంలో పర్యావరణ పరిరక్షణకు కోస్ట్‌గార్డ్ తన వంతు కృషి చేసేందుకు ముందుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్భారత్ ఉద్యమంలో భాగంగా స్వచ్ఛ్భారత్ సాగర్ అభియాన్ పేరుతో తీర ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడేందుకు కాకినాడ కోస్ట్‌గార్డ్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. సముద్ర తీర ప్రాంతాన్ని పరిరక్షించడం ద్వారా మానవాళితో పాటు జలచరాలకు పలు ప్రయోజనాలు కలుగుతాయంటూ ప్రచారం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్వచ్ఛసాగర్ కార్యక్రమాల్లో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేస్తున్నారు. కృష్ణా-గోదావరి బేసిన్ (కెజి బేసిన్) కేంద్రంగా చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికితీస్తున్న ఒఎన్‌జిసి, జిఎస్‌పిసి, రిలయన్స్, కెయిన్ ఎనర్జీ ఇండియా, కెఎస్‌పిఎల్ వంటి సంస్థలను ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. ఆయా సంస్థల పరిధిలో సముద్ర జలాల్లో వాటర్ ఫ్రంట్ క్లీనింగ్ కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో సముద్ర జలాలు కాలుష్యం భరితంగా మారుతున్నాయి. నిత్యం సముద్రంలో వందల సంఖ్యలో నౌకలు రాకపోకలు సాగిస్తుండటం, చమురు కంపెనీల కార్యకలాపాలతో సాగర జలాలను కాలుష్యం కమ్ముకుంటోంది. అలాగే తీర ప్రాంతానికి కూడా ఈ సమస్య తప్పడం లేదు. సాయం సమయాలలో సముద్ర తీరం (బీచ్)ను సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల కారణంగా పరిసరాలు చెత్త సమస్యలను ఎదుర్కొంటున్నాయి. తీర ప్రాంతంలో నిత్యం టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతోంది. వర్షాలకు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున చెత్త తరలివచ్చి సముద్ర తీరంలో చేరుతోంది. ఇటీవల కోస్టల్ క్లీన్ డే నిర్వహించిన సందర్భంలో తీర ప్రాంతం కాలుష్యం కోరల్లో చిక్కుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛ్భారత్ అభియాన్ పేరుతో సముద్ర జలాల్లో వాటర్ ఫ్రంట్ క్లీనింగ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్టు కోస్ట్‌గార్డ్ స్టేషన్ అధికారి సివిఎన్ మూర్తి చెప్పారు.